లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేష్ శివన్ వరుసగా తీర్థయాత్రలు చేస్తున్నారు. ఈ లవ్ బర్డ్స్ ఇటీవలే తిరుమల శ్రీవారిని సేవించుకున్నారు. అనంతరం ముంబైలోని మహాలక్ష్మి ఆలయం, సిద్ధి వినాయక్ ఆలయాన్ని సందర్శించారు. తాజాగా షిరిడీ చేరుకుని సాయిబాబా ఆశీర్వాదం పొందారు. కొంతకాలం క్రితం తనకు ఎంగేజ్మెంట్ అయిపోయిందని ఓ షోలో ప్రకటించిన నయన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నయనతార ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తన ప్రియుడు విగ్నేష్ శివన్ తో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టనుంది.
Read Also : మూడు యూట్యూబ్ ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా
నయనతార సినిమాల విషయానికొస్తే… నయనతార సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన “అన్నాత్తే”లో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న “కాతు వాక్కుల రెండు కాదల్” సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. అట్లీ, షారుఖ్ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘లయన్’లో కథానాయికగా కనిపించబోతోంది. ‘సైరా’ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి నయనతార ‘గాడ్‌ఫాదర్’లో రొమాన్స్ చేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. మరోవైపు, రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది ఈ బ్యూటీ.