చార్ ధామ్ ఆధ్యాత్మిక యాత్ర ముగించుకుని వచ్చిన సమంత వృత్తిగత జీవితంలో ఫుల్ బిజీ అయింది. ఇప్పటికే వరుస ప్రాజెక్ట్ లు సైన చేస్తున్న సమంత తాజాగా షారూఖ్, అట్లీ సినిమాలోనూ నటించబోతోందట. ఇందులో నయనతార స్థానంలో సమంతను ఎంపిక చేసినట్లు వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాలో ముందు సమంతనే అనుకున్నాడు అట్లీ. అయితే అప్పట్లో సంసారజీవితంలో బిజీగా కావాలనుకున్న సమంత ఆ ఆఫర్ ని అంగీకరించలేదు. ఆ తర్వాత అట్లీ షారూఖ్ సరసన నయనతారను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు. నయన్ కూడా షారూఖ్ సినిమా అనగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఈ ప్రాజెక్ట్ డిలీ అవుతూ వచ్చింది.
Read Also : “గని ఆంథమ్” సాంగ్ అదిరిపోయింది
ఇప్పుడు షారూఖ్ తనయుడు ఆర్యన్ డ్రగ్ కేసులో ఇరుక్కోవడంతో మరింత అలస్యం అవుతోంది. కానీ నయన్ విఘ్నేష్ శివన్ తో పెళ్ళికి రెడీ అవుతూ తను ఈ ప్రాజెక్ట్ చేయలేనందట. మళ్ళీ ఆ ఆఫర్ సమంత ముందు వాలింది. సమంత వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. నిజానికి ఇప్పటకే ఈ సినిమా చేస్తున్నట్లు అధికారక ప్రకటన వెలువడవలసింది. కానీ ఆర్యన్ డ్రగ్ కేసు వల్ల డిలే అవుతోందట. త్వరలోనే అఫిషీయల్ గా ప్రకటిస్తారట. మరి ఈ సినిమాతో సమంత బాలీవుడ్ లోనూ పాగా వేస్తుందేమో చూడాలి.