*మహారాష్ట్రపై సీఎం కేసీఆర్ ఫోకస్.. వచ్చే నెల 1న పర్యటన
మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ను మరింత విస్తరించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బీఆర్ ఎస్ శాఖలు ఏర్పాటైనప్పటికీ.. మహారాష్ట్రపైనే ఎక్కువగా దృష్టి సారించింది. పొరుగు రాష్ట్రం కావడంతో అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో కేసీఆర్ తన దృష్టి మహారాష్ట్రపై పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో పలు బహిరంగ సభలు, పర్యటనలు నిర్వహించిన కేసీఆర్.. వచ్చే నెలలో మళ్లీ ఆ రాష్ట్రంలోనే బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 1న కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించనున్నారు.. ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నభాపు సాఠే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు రోజా తీర్ధం పుచ్చుకోనున్నారు. అనంతరం కొల్లాపూర్‌లోని అంబాబాయి మహాలక్ష్మి అమ్మవారిని కేసీఆర్ దర్శించుకుంటారు. వచ్చే నెలలో పుణె, షోలాపూర్‌లో కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 30న షోలాపూర్‌లో బహిరంగ సభ నిర్వహించాలన్నారు. కానీ భారీ వర్షాల కారణంగా సభ వాయిదా పడింది. మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. బీజేపీతో కలిసి శివసేన, ఎన్సీపీలోని ఒక వర్గం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ పరిణామాలతో మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం నెలకొంది. అంతే కాకుండా పెద్ద రాష్ట్రం కావడంతో ముందుగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ సంస్థగా నిర్మించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర పార్టీల నేతలను కూడా చేర్చుకుంటున్నారు. ఇప్పటికే పలువురు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరారు. తాజాగా ఓ ఎంపీ కూడా కేసీఆర్‌ను కలిశారు. సదరు ఎంపీ కూడా బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
*ఉగ్ర రూపం దాల్చిన భోగత జలపాతం.. పర్యాటకులకు నో ఎంట్రీ
తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని బొగత జలపాతం ఉప్పొంగింది. భారీగా నీరు కురుస్తుండటంతో జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు బారులు తీరుతున్నారు. ప్రకృతి అందాలను చూసి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. సందర్శనకు వచ్చిన పర్యాటకులను అధికారులను వెనక్కిపంపిస్తున్నారు. ప్రమాదాల నివారణకోసం అనుమతులు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. పర్యాటకులు భోగత సందర్శనకు రావొద్దని సూచించారు. ప్రమాదం జరిగే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ జలపాతం వద్దకు వెళ్లొద్దని సూచించారు. మరోవైపు గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వానలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరుగుతుంది. ఈరోజు ఉదయం 9 గంటల సమయంకి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 25.8 అడుగులకు చేరుకుంది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే 43 అడుగులకు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గత ఏడాది ఇదే సమయంలో గోదావరి ఉగ్ర రూపంలో ప్రవహించింది.. అయితే అంతటి స్థాయిలో ఇప్పటికిప్పుడు గోదావరికి వరద వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు వస్తున్నప్పటికీ ప్రమాదకర స్థాయిలో మాత్రం వర్షాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మరో ఐదు నుంచి పది అడుగుల వరకు గోదావరి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎగువన ఉన్న అన్ని ప్రాజెక్టులు వదిలిపెడితే మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉన్నట్లుగా సిడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు.
*చంద్రబాబు ప్రభుత్వం తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం
భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. పోలవరం నిర్మాణ పనులపై మంత్రి ఆరా తీశారు. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్ దగ్గర వరదపై సమీక్ష చేపట్టారు. లోయర్, అప్పర్ కాపర్ డ్యాంలు రెండు పూర్తయిన తర్వాత వస్తున్న మొదటి వరద అంటూ మంత్రి తెలిపారు. గత ఏడాది లోయర్ కాపర్ డ్యాం పూర్తి కాకపోవడంతో పనులు నిలిచిపోయాయన్నారు. ప్రస్తుతం లక్షా 20 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతోందన్నారు. 2018లో అప్పర్ కాపర్ డ్యాం, 2015లో లోయర్ కాపర్ డ్యాం నిర్మించడం మొదలు పెట్టారని.. గత ప్రభుత్వాలు ప్రొటోకాల్ లేకుండా పనులు చేపట్టారని విమర్శించారు. దీని వల్ల తీవ్ర నష్టం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోయర్, అప్పర్ కాపర్ డ్యాంలను పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వాలు ఎంతటి తప్పిదాలు చేశాయి అనేది పదేపదే చెప్తున్నామన్నారు. నదిని డైవర్ట్ చేసే పని చేయకుండా లోయర్, అప్పర్ కాపర్ డ్యాం పనులు చేపట్టారన్నారు. నది డైవర్ట్ అయ్యే అవకాశం లేకపోవడం వల్ల 54గ్రామాలు మునుగుతాయని అని పిటిషన్ వేశారన్నారు. వరద ఇంకా పెరిగి పనులు జరిగే ప్రాంతానికి నీరు చేరితే పనులు ఆపేస్తామన్నారు. వరద సమయంలో సాధ్యమైనంత వరకు పనులు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి అంబటి మాట్లాడుతూ.. “గత ప్రభుత్వం ప్రొటోకాల్‌కు విరుద్దంగా పనులు చేపట్టింది. గత ప్రభుత్వం పోలవరం పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయింది? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం తప్పిదాల వల్లే ప్రాజెక్ట్ ఆలస్యమైంది. పోలవరం ప్రాజెక్ట్‌పై మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మా ప్రభుత్వంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది” అని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
*చితకబాది.. నోట్లో మూత్రం పోసి..
ప్రకాశం జిల్లా కేంద్రంలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. ఓ గిరిజన యువకుడితో ఫుల్లుగా మద్యం తాగించిన కొందరు వ్యక్తులు అతడిని చావబాది ఆపై నోట్లో మూత్రం పోసి పైశాచిక ఆనందం పొందారు. అంతేకాదు, మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలని బలవంతం చేస్తూ చితకబాదారు. రక్తమోడుతున్న ఆ గాయాలతో అతను విలవిల్లాడుతున్నా కనికరం చూపలేదు. ఈ మొత్తం ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే.. బాధితుడైన గిరిజన యువకుడి పేరు మోటా నవీన్, ప్రధాన నిందితుడు మన్నె రామాంజనేయులు (అంజి) ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. నేరాలకు పాల్పడే వీరిపై 50కిపైగా గృహ దొంగతనాల కేసులు ఉన్నాయి. నవీన్ పలుమార్లు జైలుశిక్ష కూడా అనుభవించాడు. అంజి మాత్రం కొన్నేళ్లుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కొంతకాలంగా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. నెల రోజుల క్రితం మద్యం తాగుదామంటూ నవీన్‌ను అంజి ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రి వద్దకు పిలిచాడు. వెళ్తే అక్కడ మొత్తం 9 మంది కనిపించారు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు. ఆపై అంజి, నవీన్ మధ్య పాత గొడవ మరోమారు రేగింది. దీంతో అందరూ కలిసి నవీన్‌పై మూకుమ్మడి దాడిచేశారు. తనను వదిలెయ్యాలని బతిమాలినా వినిపించుకోలేదు. రక్తమోడేలా కొట్టారు. ఆపై నవీన్ నోట్లో మూత్రం పోస్తూ మర్మాంగాన్ని అతడి నోట్లో పెట్టుకోమని బలవంతం చేశారు. కొందరు ఈ తతంగం మొత్తాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఆ తర్వాత బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అదికాస్తా ఉన్నతాధికారుల దృష్టిలో పడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, ఇద్దరిని మాత్రం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై బాధితుడు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేవలం దాడి, ఎస్సీ, ఎస్టీ కేసుగా నమోదు చేసి చేతులు దులుపుకున్నట్లు తెలిసింది. నిందితులు విచారణ, అరెస్టుకు సైతం ప్రయత్నించలేదని సమాచారం. తాజాగా నిందితుల్లో కొందరు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అది వైరల్‌గా మారి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమై నిందితుల కోసం వెతుకులాట ప్రారంభించారు. ప్రధాన నిందితుడు పరారీ కాగా.. మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
*రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు… నేడు అఖిలపక్ష సమావేశం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు ముందుగా కేంద్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వర్షాకాల సమావేశాలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంట్ సజావుగా సాగేందుకు ప్రభుత్వం ప్రతిపక్షాల సహకారాన్ని కోరనుంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని పిలిచారు. అయితే పలు పార్టీల నాయకులు అందుబాటులో లేకపోవడంతో సమావేశం వాయిదా పడింది. మంగళవారం బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరుగుతుండగా, దేశ రాజధానిలో అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సమావేశమైంది. మరోవైపు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజ్యసభలో సభాపక్ష నేత పీయూష్ గోయల్‌తో సహా కేబినెట్ సహచరులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో బుధవారం జరిగే అఖిలపక్ష సమావేశానికి సంబంధించి వ్యూహం రచించినట్లు సమాచారం. పార్లమెంటు సమావేశాలకు ముందు, అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి, వివిధ పార్టీలు తమ సమస్యలను చెప్పుకునే సంప్రదాయం ఉంది. ఈ సమావేశంలో ప్రభుత్వ సీనియర్ మంత్రులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇలాంటి అనేక సభల్లో పాల్గొన్నారు. వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11 వరకు సభ కొనసాగనుంది. ఈ కాలంలో పార్లమెంటు ఉభయ సభల మొత్తం 17 సమావేశాలు ప్రతిపాదించబడ్డాయి. సెషన్ వాడీవేడిగా ఉంటుందని భావిస్తున్నారు. ఒకవైపు అధికార పక్షం ముఖ్యమైన బిల్లులకు ఆమోదం తెలపడానికి ప్రయత్నిస్తుండగా, మరోవైపు మణిపూర్ హింస, రైలు భద్రత, ధరల పెరుగుదల, అదానీ కేసులో జేపీసీ ఏర్పాటు డిమాండ్ వంటి ఇతర అంశాలపై ప్రతిపక్షం ప్రభుత్వాన్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తుంది.
*ప్రియురాలి భర్తను ముక్కలుగా చేసి మొక్కలు నాటిన ప్రియుడు
అక్రమ సంబంధాలు జీవితాలను నాశనం చేస్తాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో దారుణ ఘటనలను చూస్తూనే ఉన్నాం..తాజాగా ఓ వివాహేతర సంబంధం మనిషి ప్రాణాన్ని తీసింది.. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది..రాజస్థాన్ లోని పాలిలో 33 ఏళ్ల వ్యక్తిని అతని భార్య ప్రేమికుడు హత్య చేసి, మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికి, వేర్వేరు ప్రదేశాల్లో పాతిపెట్టాడు. శరీరభాగాలను ఖననం చేసిన స్థలంలో నిందితుడు మామిడి మొక్కను నాటినట్లు పోలీసులు తెలిపారు. జోగేంద్ర అనే వ్యక్తిని హత్య చేసి, మొండెంను సమీపంలోని అడవిలో పాతిపెట్టాడు. ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్న తోటలో తల, చేతులు, కాళ్లు పాతి పెట్టాడు.నిందితుడు జోగేంద్ర శరీర భాగాలను ఖననం చేసిన స్థలంలో మామిడి మొక్కను నాటినట్లు పోలీసులు వెల్లడించారు.. బయటకు వెళ్ళిన కొడుకు ఎప్పటికి తిరిగి రాకపోవడంతో జోగేంద్ర తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు..దాంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కొడుకు కనిపించకుండా పోవడంలో మదన్‌లాల్ ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తం చేశాడు. నా కొడుకును చంపడంలో మరికొంత మంది ప్రమేయం కూడా ఉందని నేను నమ్ముతున్నాను అని మృతుడి తండ్రి మిశ్రలాల్ మేఘ్వాల్ అన్నారు… ఇక మదన్ లాల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో, జోగేంద్ర భార్యతో తనకు సంబంధం ఉందని మదన్ లాల్ ఒప్పుకున్నాడు.. మా ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నాడని అతన్ని హత్య చేసినట్లు మదన్‌లాల్ అంగీకరించాడు. నేరం ఎలా చేశాడనే వివరాలను కూడా చెప్పాడు.. అతను చెప్పిన వివరాల ప్రకారం శరీర భాగాలను తీశారు.. అనంతం పోస్ట్ మార్టం కు తరలించారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
*బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాలోకి ప్రియురాలి ఎంట్రీ
ఈ మధ్యకాలంలో సరిహద్దులు దాటిన ఓ ప్రేమకథను మీరు చూసే ఉంటారు. 2019లో పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన భారతీయ యువకుడు సచిన్ మీనాను వెతుక్కుంటూ పాకిస్థాన్ నుంచి సీమా హైదర్ అనే మహిళ వచ్చారు. ఆమెతో పాటు తన నలుగురు పిల్లలను వెంట పెట్టుకుని సరిహద్దులు దాటారు. అయితే, అచ్చం సీమా హైదర్‌లాగే గత సంవత్సరం భారతీయ ప్రేమికుడి కోసం బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి ఇండియాకు కృష్ణ మండల్ అనే ప్రియురాలు చేరుకుంది. కోల్‌కతాకు చెందిన అభిక్ మండల్ ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యింది. ఫేస్ బుక్ లో పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. కనీసం పాస్‌పోర్ట్ కూడా లేని ఆమె రహస్యంగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు చేరుకుంది. ఆమె వస్తున్న దారిలో ఎదురైన ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ తన ప్రయాణం కొనసాగించింది. పులులు సంచరించే దట్టమైన అడవులు, ప్రవహించే నదులు వంటి ఆటంటకాలు ప్రేమ ముందు ఆమెకు ఎంతో చిన్నవిగా కనిపించాయి. వాటన్నింటినీ దాటుకుని భారత్‌లో అడుగు పెట్టారు. కృష్ణ మండల్ కు పాస్‌పోర్ట్ లేకపోవడంతో ప్రజల కంటపడకుండా రహస్యంగా బెంగాల్‌కు చేరుకుని.. అక్కడ అభిక్‌ను కలుసుకుంది. ఈ ప్రేమికులు ఇద్దరు కోలకతాలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వారి కోరిక తీరలేదు.. కృష్ణ మండల్ అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డారంటూ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తన దగ్గర ఎలాంటి పాస్‌పోర్ట్ లేదని ఆమె పోలీసులకు చెప్పింది. అందుకే తాను ప్రమాదకమైన దారిలో ప్రయాణించి ఇక్కడకు చేరుకున్నానని చెప్పింది. అయినప్పటికీ సురేంద్రపూర్ పోలీసులు అమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు ఆమెకు మూడు నెలల జైలు శిక్ష వేసింది. అయితే, శిక్ష పూర్తయిన తర్వాత అధికారులు ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించి వేశారు.
*ఆగస్టు 8న పాకిస్థాన్ పార్లమెంట్ రద్దు చేసే ఛాన్స్
పదవీకాలం ముగియక ముందే పాకిస్థాన్ ప్రభుత్వాన్ని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు అదనపు సమయం పొందేందుకు ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి కొద్ది రోజుల ముందు ఆగస్టు 8న జాతీయ అసెంబ్లీని రద్దు చేసేందుకు పాకిస్థాన్ ప్రధాన పాలక సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత జాతీయ అసెంబ్లీ ఐదేళ్ల రాజ్యాంగ కాలపరిమితి ఆగస్టు 12 అర్ధరాత్రితో ముగియనుంది. అయితే, శాసనసభను రద్దు చేయడానికి అంగీకరించిన తర్వాత.. నాలుగు రోజులకు.. కానీ అంతకుముందే జాతీయ పార్లమెంట్ ను రద్దు చేసే అవకాశం ఉంది. ఫెడరల్ ప్రభుత్వంలో రెండు ప్రధాన భాగస్వాములైన పాకిస్తాన్ పీపుల్స్, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ ఆగస్టు 8 న జాతీయ అసెంబ్లీని రద్దు చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఆగస్టు 9, 10 తేదీల్లో పార్లమెంట్ రద్దు గురించి చర్చకు వచ్చింది.. అయితే పార్లమెంటు దిగువ సభను త్వరగా రద్దు చేయడానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు ఆగస్టు 8నే క్యాన్సిల్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే రాజ్యాంగబద్ధంగా జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తే 90 రోజుల్లోగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. తమ పదవీకాలం పూర్తికాకముందే మధ్యంతర ప్రభుత్వం వస్తుందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. బిలావల్ జర్దారీ-భుట్టో నేతృత్వంలోని పీపీపీ రాజ్యాంగ కాలపరిమితికి ముందే జాతీయ అసెంబ్లీని రద్దు చేసేందుకు ప్రతిపాదించింది. దీనికి సంబంధించి ఎలాంటి తేదీని ఇంకా నిర్ణయించలేదని సమాచార శాఖ మంత్రి మర్రియుమ్ ఔరంగజేబ్ అన్నారు. పీడీఎం, ఇతర మిత్రపక్షాలతో చర్చించి ఓ డేట్ ఫిక్స్ చేస్తామని చెప్పారు. ఒకసారి జాతీయ అసెంబ్లీ రద్దైన తర్వాత, ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడే వరకు షరీఫ్ కొద్ది రోజుల పాటు ప్రధానిగా తన విధులను కొనసాగించనున్నాడు.
*ఆసియా కప్ 2023 షెడ్యూల్.. సెప్టెంబర్ 2న భారత్-పాకిస్తాన్ మ్యాచ్!
హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్న పురుషుల ఆసియా కప్ 2023 షెడ్యూల్ బుధవారం (జూలై 19) విడుదల కానుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) కొత్త చైర్మన్ జాకా అష్రఫ్ బుధవారం రాత్రి 7.45కి లాహోర్‌లో అధికారిక షెడ్యూల్‌ను ప్రకటిస్తారు అని పీసీబీ పేర్కొంది. ఈ టోర్నమెంట్ ఆగష్టు 31న లాహోర్‌లో ప్రారంభమవుతుందని సమాచారం. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుందని తెలుస్తోంది. ఆసియా కప్ 2023 షెడ్యూల్ ( Asia Cup 2023 Schedule) జులై 15న ఖరారు అయినా.. టోర్నీ ఏర్పాట్లు మరియు మార్కెటింగ్ ప్రచారాలకు సంబంధించి పీసీబీ మరియు ఏసీసీ అధికారుల మధ్య సమావేశం కారణంగా నేడు రిలీజ్ చేస్తున్నారట. భారత్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య ఎన్నో గొడవల తర్వాత ఆసియా కప్ 2023 నిర్వహణకు అన్ని మార్గాలు క్లియర్ అయ్యాయి. హైబ్రీడ్ మోడల్‌లో జరగనున్న ఆసియా కప్ 2023లో 13 మ్యాచ్‌లు ఉంటాయి. ఈ 13 మ్యాచ్‌లకు పాకిస్తాన్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాక్‌లో 4, శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. పాక్‌లో నాలుగు మ్యాచ్‌ల అనంతరం.. టోర్నీ శ్రీలంకకు తరలిపోతోంది. శ్రీలంకలోనే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుంది. 2023 ఆసియా కప్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే పాకిస్తాన్‌లో పర్యటించేందుకు భారత్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో తటస్థ వేదికపై మ్యాచ్‌లు జరుగనున్నాయి. అంచనాల ప్రకారం ఆగస్టు 31న ప్రారంభమయ్యే 2023 ఆసియా కప్.. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్‌తో పాటు నేపాల్ కూడా ఈ టోర్నీలో ఆడబోతోంది. ఈ ఎడిషన్‌లో మూడేసి జట్లుగా రెండు గ్రూప్‌లుగా తొలి రౌండ్ మ్యాచులు ఆడుతాయి. ఆపై సూపర్ 4 రౌండ్‌లో టాప్‌లో నిలిచిన రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
*జీవితా రాజశేఖర్ దంపతులకు రెండేళ్ల జైలు శిక్ష.. కారణం ఇదే?
యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ జీవిత దంపతులకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధ మంగళవారం సంచలన తీర్పు ఇచ్చారు. పరువు నష్టం కేసులో దంపతులకు జైలుశిక్ష ఖరారైంది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై రాజశేఖర్ దంపతులు ఒకానొక మీడియా సమావేశంలో తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ చిరంజీవి బావ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011లో కేసు దాఖలు చేశారు. దీనిపై కోర్టు తన తీర్పు ప్రకటించింది. జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు.. రెండేళ్ల జైలు శిక్ష తో పాటు 5 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. కేసు వివరాల్లోకి వెళితే.. చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత, రాజశేఖర్ మీడియా సాక్షిగా ఆరోపించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ దానిపై కోర్టును ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపైన, ట్రస్టు పైనా అసత్య ఆరోపణలు చేశారంటూ పరువునష్టం కేసు వేశారు. వారు చేసిన ఆరోపణలకు సబంధించిన వీడియోతో పాటు.. మీడియాలో వచ్చిన కథనాలను కూడా జత చేసి కోర్టు ముందు ఉంచారు. సుదీర్ఘ విచారణ అనంతరం సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు.. రాజశేఖర్, జీవితకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇద్దరికీ ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధించింది. అయితే, జరిమానా చెల్లించడంతో… ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో వారిద్దరికి 10 చొప్పున పూచీకత్తులను సమర్పించగా కోర్టు పై కోర్టులో అప్పీలుకు అవకాశమిస్తూ దంపతులకు బెయిలు మంజూరు చేసింది.