Uttar Pradesh: ప్రభుత్వ ఆఫర్.. అక్కడ సగం రేటుకే టమోటాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జనాలు ఇప్పుడు సగం ధరకే టమోటాలు పొందనున్నారు. వారికి మొబైల్ వ్యాన్‌ల ద్వారా ఈ సదుపాయం అందించింది అక్కడి ప్రభుత్వం. లక్నో మేయర్ సుష్మా ఖార్క్వాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. భారత ప్రభుత్వ సహకారంతో నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సిసిఎఫ్‌ఐ) ద్వారా.. లక్నోలోని 11 చోట్ల టమాటోలను మొబైల్ వ్యాన్‌లలో కిలో రూ.80కి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. అయితే ఒక వ్యక్తి రోజుకు 2 కిలోల టమోటాలు మాత్రమే కొనుగోలు చేయాలి.
World Cup: ప్రపంచ కప్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లు వచ్చేస్తున్నారు..!
Also Read
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
- UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
లక్నోలోని మడియాన్వ్ ప్రాంతంలో మొబైల్ వ్యాన్‌ల ద్వారా NCCF ప్రజలకు టమోటాలు అందిస్తోంది. మార్కెట్లలో టమాట ధరలు ఆకాశాన్నంటుతుండగా.. మొబైల్ వ్యాన్ లలో టమాటా కొనుగోలు చేసే వారు బారులు తీరారు. మరోవైపు ఇలాంటి కార్యక్రమం చేపట్టడంపై.. భారత ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సామాన్యులకు కొంత ఊరట లభించనుంది. మార్కెట్లలో వ్యాపారులు కిలో టమాటా రూ.120 నుంచి 130 వరకు అమ్ముతున్నారు. మరికొన్ని చోట్ల మార్కెట్‌లలో టమాటా 160 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు.
Harassment: 18 మంది బాలికలపై వేధింపులు.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
పెరుగుతున్న టమాటా ధరలపై కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే మాట్లాడుతూ.. 22 నిత్యావసర వస్తువుల జాబితాలో టమోటాలు, ఉల్లిపాయలు కూడా ఉన్నాయని తెలిపారు. టమాటా ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం నాఫెడ్ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాటిని విక్రయించడం ప్రారంభించిందని తెలిపారు. అంతేకాకుండా బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. బీహార్ ప్రభుత్వాన్ని కూడా బ్లాక్ మార్కెటింగ్ ఆపాలని కోరినట్లు పేర్కొన్నారు. కానీ బీహార్ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా బ్లాక్ మార్కెట్ దందా కొనసాగిస్తుందంటూ విమర్శించారు.
తాజావార్తలు
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
-
Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?