Uttarakhand: ఉత్తరాఖండ్లో పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. 16 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని నమామి గంగే ప్రాజెక్టు వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అలకనంద నది ఒడ్డున ఉన్న ప్రాజెక్ట్ సైట్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌లో పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారణకు ఆదేశించారు. గంగా నదిని కాలుష్య రహితంగా మార్చేందుకు 36 మురుగునీటి శుద్ధి ప్లాంట్లను నిర్మిస్తున్నారు. గత ఏడాది జూన్‌లో.. గంగా నది పునరుద్ధరణ కోసం 36 మురుగునీటి శుద్ధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో ఆమోదించింది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (NMCG) ప్రకారం.. దాని ఫ్లాగ్‌షిప్ ‘నమామి గంగే’ ప్రాజెక్ట్ ద్వారా, రాష్ట్రంలోని ప్రతి గంగా నదికి స్వచ్ఛమైన నీరు వచ్చేలా కేంద్రం బహుముఖ ప్రయత్నం ద్వారా మిషన్ మోడ్‌లో పనిచేస్తోంది.
Bro Ticket Rates: మొత్తానికి భలే సెట్ చేశారు ‘బ్రో’
Also Read
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్‌లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. కరెంట్ షాక్ తో ఓ వాచ్‌మెన్ మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు సిబ్బంది స్పాట్ ఇన్‌స్పెక్షన్ కోసం వెళ్ళారు. ఆ సమయంలో ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్, ఐదుగురు హోంగార్డులతో సహా దాదాపు 16 మంది మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుండగా.. రైలింగ్‌లో కరెంట్ ఉందని ప్రాథమికంగా వెల్లడైంది. దర్యాప్తు తరువాత మిగతా వివరాలు తెలుస్తాయి అని ఉత్తరాఖండ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు.
Viral Video: ఢిల్లీ మెట్రోలో యువతి విన్యాసాలు..దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్..
మరోవైపు ఈ ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన అని అన్నారు. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్, రెస్క్యూ టీం సిబ్బంది ఘటనా స్థలంలోనే ఉన్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ముఖ్యమంత్రి చెప్పారు. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా ఎయిమ్స్ రిషికేశ్‌కు తరలిస్తున్నామని, మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇంధన కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యానికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్‌లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
-
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
-
Tollywood Wedding: సైలెంట్‌గా న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్‌తో ఫోటోలు వైరల్!
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
-
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్‌పై నెటిజన్ల ఫైర్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!