Uttar Pradesh: ప్రియురాలి ఇంటికి వచ్చిన ప్రియుడు.. గొడ్డలితో నరికి చంపిన కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఓ దారుణ ఘటన చోటు చోటుచేసుకుంది. తన ఇంటికి వచ్చిన ఓ వ్యక్తిని యువకుడు గొడ్డలితో నరికి చంపాడు. కొడుకుకి, తల్లికి మధ్య గొడవ జరుగుతుండగా.. దాన్ని పరిష్కరించేందుకు వచ్చిన వ్యక్తిని కిరాతకంగా చంపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు ఆస్పత్రికి తరలించారు.
Pawan Kalyan: ఇది రాజ్యాంగ ఉల్లంఘనే.. సీఈసీ చర్యలు తీసుకోవాలి..
Also Read
- Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
నిందితుడు సుబేహా కాలనీలో నివసిస్తున్న అష్ఫాక్‌గా గుర్తించారు పోలీసులు. మృతుడు ఔసాఫ్ కూడా అదే కాలనీలో నివసాముంటున్నాడు. అయితే అష్ఫాక్ తల్లికి 55 ఏళ్ల ఔసాఫ్‌తో ప్రేమ వ్యవహారం ఉందని.. ఇద్దరూ ఏకాంతంగా కలిసేవారని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయం అష్ఫాక్‌కు కూడా తెలియడంతో తల్లీకొడుకుల మధ్య గొడవలు జరిగేవి. శుక్రవారం కూడా తల్లీకొడుకుల మధ్య గొడవ జరిగింది. దీంతో అష్ఫాక్ తల్లి తన ప్రియుడిని ఔసాఫ్‌ను పిలిచింది. అయితే తల్లీకొడుకుల మధ్య గొడవలో ఔసాఫ్ వచ్చి అష్ఫాక్‌ను శాంతింపజేసేందుకు ప్రయత్నించాడని.. కానీ అతన్ని చూడగానే అష్ఫాక్ మరింత కోపం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన అష్ఫాక్ గొడ్డలితో ఔసాఫ్ పై దాడి చేశాడు.
IPhone 15 Pro: ఐఫోన్ 15 సిరీస్ ఫీచర్స్ అదుర్స్.. Wi-Fi 6E టెక్నాలజీ ప్రో మోడల్స్
అయితే ఈ ఘటనపై స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఔసఫ్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడు అష్ఫాక్‌పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ సంబంధం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- axe
- boyfriend
- kill
- national news
- son
తాజావార్తలు
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
-
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..