వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. అధికార పార్టీ బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, ఇతర ముఖ్యనేతలు పర్యటిస్తున్నారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల్లో పార్టీ తరపున పరివర్తన్ యాత్ర చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఈనెల 28, 29 తేదీల్లో తమిళనాడు, తెలంగాణలో పర్యటించనున్నారు. తమిళనాడులో రాష్ట్ర బీజేపీ పరివర్తన్ యాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అటు తెలంగాణలో బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు.
YadammaRaju: జబర్దస్త్ నటుడికి యాక్సిడెంట్.. భార్య చేసిన పనికి బూతులు తిడుతున్న నెటిజన్స్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీజేపీ ఆందోళనలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకే వచ్చే ఏడాదిలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించింది. తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో అక్కడ గరిష్ట సంఖ్యలో స్థానాలపై బిజెపి తన పట్టును పటిష్టం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
BlueTea Benefits : బ్లూటీని రోజూ ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో.. ఆ రోగాలు జన్మలో రావు..
తమిళనాడులో పర్యన అనంతరం.. అమిత్ షా మరుసటి రోజు తెలంగాణకు చేరుకోనున్నారు. హైదరాబాద్‌లో జరిగే బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొని.. రాష్ట్రంలో పార్టీ పని తీరును సమీక్షించనున్నారు. తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని పార్టీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తెలంగాణకు చెందిన కొందరు బీజేపీ నేతల మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు బయటకు వచ్చాయి. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గత నెలలో ఓ వివాదాస్పద పోస్ట్ చేయడంతో రాష్ట్రంలోని బీజేపీ నేతల మధ్య ఉన్న వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపై అమిత్ షా ఇప్పటికే పలువురు నేతలకు సూచనలు చేశారని, పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారని, దీని తర్వాత కూడా నేతల మధ్య విభేదాలు వీడటం లేదని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో జులై 29న జరగనున్న సమావేశంలో నేతలకు షా నుంచి గట్టి వార్నింగ్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.