మాములుగా ఐతే ఒక ఆడపిల్లకు పెళ్లి చేస్తే కట్నంగా.. తల్లిదండ్రులు డబ్బులు, బంగారం, భూములు ఇతర ఆస్తులను పెళ్లి కొడుకు వారికి కానుకగా సమర్పించుకుంటారు. ఈ ఆచారం ఎప్పటి నుంచో అమలవుతున్నప్పటికీ.. ఛత్తీస్ ఘడ్ లో ఓ తెగకు చెందిన ప్రజలు తమ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. వారు తమ కూతుళ్లకు పెళ్లి చేస్తే.. డబ్బు, నగలు కట్నంగా ఇవ్వరంట. పాములను కట్నంగా ఇస్తారట..
CV Anand: తస్మాత్ జాగ్రత్త.. టెలిగ్రామ్, వాట్సాప్‌ల ద్వారా పెట్టుబడి మోసాలు!
ఛత్తీస్‌గఢ్‌లో కన్వారా తెగకు చెందిన ప్రజలు.. ఆడపిల్లకు పెళ్లి చేస్తే.. వరుడికి పాములను కట్నంగా ఇస్తారు. అవి కూడా 9 రకాలకు చెందిన 21 పాములను కట్నంగా ఇస్తారు. ఒకవేళ కట్నంగా పాములు ఇవ్వలేదంటే.. ఆ పెళ్లి ఆగిపోవాల్సిందే.. ఎందుకంటే ఆ వధువును వివాహం చేసుకోరు. అయితే తమ పూర్వీకులు కనీసం 60 పాములను కట్నంగా ఇచ్చేవారని.. ఇప్పుడు ఆ సంఖ్య క్రమంగా తగ్గినట్లు ఆ తెగకు చెందిన వారు చెబుతున్నారు. పాములను కట్నంగా ఇవ్వడం తమ ఆచారంగా వస్తోందని తెలుపుతున్నారు.
Box Office War: వార్ ఫిక్స్… విజయ్ vs బాలయ్య
కన్వారా తెగ ప్రజలు తమ పూర్వీకుల నుంచి పాములను ఆడించడం జీవనాధారంగా చేసుకున్నారు. రకరకాల పాములతో ఆటలు ఆడించడం.. వచ్చిన డబ్బులతో వారు జీవనం సాగిస్తారు. అంతేకాదు.. పాములనే తమ ఆస్తిగా భావిస్తారు. అందుకే ఆడపిల్లకు కట్నంగా పాములనే ఇస్తుంటారు. మరోవైపు విషరహిత పాములను మాత్రమే పట్టుకుని జీవనం సాగించాలని అటవీ అధికారులు ఆ తెగ ప్రజలకు సూచించారు. స్థానిక సంప్రదాయాలను గౌరవించి ప్రభుత్వం కూడా అనుమతులు ఇస్తోందని అటవీ రేంజి అధికారి సియారామ్ కర్మాకర్ తెలిపారు.