ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మోసాలు చేయడం చాలా చూస్తున్నాం. ఎలాగోలా డబ్బులు సంపాదించేకునేందుకు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా ఓ యువకుడిని ఫేస్బుక్ మోసం చేసిన ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఫేస్బుక్లో పరిచయమైన ఇద్దరు యువతులతో ఓ యువకుడు చాటింగ్ చేశాడు. ఆ తర్వాత ఓ యువతి.. యువకుడిని ఫైవ్ స్టార్ హోటల్‌కు పిలిపించి అతని వద్ద ఉన్న వస్తువులన్నీ దోచుకుంది.
Ponguleti Srinivas Reddy: తెలంగాణలో అధికారం ఎవరబ్బా సోత్తు కాదు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసన్‌సోల్‌కు చెందిన ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని కలిశాడు. అయితే ఆ యువతి అతన్ని కోల్‌కతాకు రావాలని చెప్పింది. దీంతో కోల్‌కతా వచ్చిన యువకుడు.. న్యూ టౌన్‌లోని ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉండాలని యువతి చెప్పింది. మొదట యువకుడు పార్క్ స్ట్రీట్‌లోని ఒక హోటల్‌లో ఉందామని అనగా.. దానికి యువతి అంగీకరించలేదు. ఆ తరువాత ఇద్దరూ న్యూటౌన్‌లోని ఫైవ్ స్టార్ హోటల్‌లో గదిని బుక్ చేసుకోవడానికి అంగీకరించారు.
Naveen Vijaya Krishna: విజయ నిర్మల పెద్ద మనవడు.. నరేష్ కొడుకు ఏంటి ఇలా మారిపోయాడు..?
జులై 26న న్యూటౌన్‌లోని హోటల్ లో యువకుడు ఓ రూమ్ బుక్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరు యువతులు హోటల్ గదికి వచ్చారు. తర్వాత ఆహారం కోసమని.. ఓ యువతితో కలిసి బయటకు వెళ్లాడు. ఇంతలోనే రూమ్ లో ఉన్న మరో యువతి.. యువకుడు వచ్చే సరికి మద్యం సిద్ధం చేసింది. అయితే తాను తాగనని.. యువకుడు ఎంత చెప్పినప్పటికీ యువతి పదేపదే తాగాలని చెప్పింది. దీంతో చివరకు మద్యం సేవించాడు. ఆ తర్వాత స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అమ్మాయిలిద్దరూ యువకుడి వద్ద ఉన్న నెక్లెస్, ఉంగరం, 30 వేల రూపాయలతో అక్కడి నుంచి ఉడాయించారు. ఆ తర్వాత మెలుకువ వచ్చి చూసేసరికి.. తాను మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
UP CM Yogi Adityanath: నేరస్థులకు ప్రభుత్వం హారతి పట్టదు: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
వెంటనే ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా సోమవారం తల్లిగంజ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లను పరిశీలించిన తర్వాత.. ఆ ఇద్దరు యువతులు ఇలా ఆన్ లైన్ లో యువకులను స్నేహితులుగా చేసుకుని మోసం చేస్తారని తేలింది. అంతేకాకుండా తమ ఫోన్లలో పలువురు యువకుల ఫోన్ నంబర్లు లభ్యమయ్యాయి. యువతులను అరెస్టు చేసిన పోలీసులు.. మంగళవారం బరాసత్ కోర్టులో హాజరుపరిచారు.