Bus Catches Fire: ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలోని మర్దా పోలీస్ సర్కిల్ పరిధిలోని బర్హి గ్రామ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లైవ్ విద్యుత్ తీగలను తాకడంతో ఓ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు పలువురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. ఘాజీపూర్‌లో ఈ ఘటన సోమవారం జరిగింది. మూలాల ప్రకారం, మౌ జిల్లా నుండి వస్తున్న బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులతో వివాహ కార్యక్రమానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది.
Read Also: N.V Ramana : వెంటాడి మరీ నాకు సన్మానం చేశారు ఎందుకో అర్ధం కాలేదు
దాదాపు ఐదుగురికి పైగా మృతి చెందినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు మృతుల సంఖ్యను ఇంకా నిర్ధారించలేదు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి గుమిగూడారు. కానీ సీఎన్‌జీ సిలిండర్లు అమర్చినట్లు చెప్పబడుతున్న బస్సు దగ్ధం వద్దకు వెళ్లడానికి ధైర్యం చేయలేకపోయారు. బస్సు హైటెన్షన్ విద్యుత్ వైర్లను తాకడంతో భారీగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే బస్సు మొత్తం మంటల్లో కాలిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే రంగంలోకి దిగి మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అన్ని సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బస్సు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
बारात से वापस आ रही बस पर आज बिजली का तार गिरने से गाजीपुर, उत्तर प्रदेश मे बड़ा हादसा,
दर्जनों की जान जाने की खबर, दुखद!!#ghazipur @Uppolice @myogiadityanath pic.twitter.com/6DcBwdnsUG
— विशु _हिंदुस्तानी 🇮🇳 (@Vishu_4UU) March 11, 2024