టీడీపీ నేత నారా లోకేష్‌పై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ఎక్కడ బిడ్డ పుట్టినా నేనే నాన్న అంటూ పరుగెత్తుకుని వెళ్లేరకం లోకేష్ అని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో నాలుగు సార్లు పరిశ్రమల సమ్మిట్ పెట్టారని.. ఖర్చుల పేరుతో రూ.150 కోట్లు చూపించారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఫోటోల్లో పారలు పట్టుకున్నది ఎక్కడ.. పరిశ్రమ వచ్చింది ఎక్కడో లోకేష్ చెప్పగలడా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో సూటు, బూటు, ఫోటోలు తప్ప గ్రౌండ్ అయిన పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్నారు.
లోకేష్ అసలు ఎవరికి పుట్టాడో తెలియదని.. చంద్రబాబు కొడుకు అయి ఉండి ఎన్టీఆర్ వారసుడిగా ఎందుకు చెప్పుకుంటున్నాడని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఎన్టీ రామారావు వారసుడని చెప్పుకునే అర్హత లోకేష్‌కు లేదన్నారు. ఖర్జూర నాయుడు వారసుడిని అని ఎప్పుడైనా చెప్పుకున్నావా లోకేష్ అని నిలదీశారు. అసలు నీ తండ్రికి తండ్రి పేరు ఎప్పుడైనా పలికావా అని అడిగారు. ‘నీ తండ్రి వెన్నుపోటుతో ఎన్టీఆర్‌ను చంపేస్తాడు… మళ్ళీ వారసుడిని అని చెప్పుకుంటావు’ అంటూ చురకలు అంటించారు. తాము ఏదైనా అంటే చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ బయటకు వెళ్లి ఏడుస్తారని.. అధికారం కోసం సొంత భార్యనే చంద్రబాబు రోడ్డుమీద నిలబెట్టారని విమర్శించారు. బీజేపీతో టీడీపీ అక్రమ సంబంధాలు ఆత్మకూరు ఎన్నికల్లో మరోసారి బయటపడిందని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు.