ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించాలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయగలరా అంటూ సీఎం జగన్‌ను లోకేష్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు.
‘ఎన్డీయే అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి అని ఏ2 సెలవిచ్చారు. స్పెషల్ స్టేటస్ సాధిస్తారని ప్రజలు 22 మంది ఎంపీలను ఇచ్చారు. ప్రత్యేక హోదా ప్రకటిస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని ప్రకటించగలరా? మెడలు వంచుతారా? కేసుల మాఫీ కోసం తల దించుతారా జగన్ రెడ్డి గారు?’ అంటూ లోకేష్ ప్రశ్నించారు. ఈ మేరకు గతంలో జగన్ మాట్లాడిన మాటల వీడియోను కూడా లోకేష్ పోస్ట్ చేశారు.
ఎన్డీఏ అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి అని ఏ2 సెలవిచ్చారు.స్పెషల్ స్టేటస్ సాధిస్తారని 22 మంది ఎంపీలని ప్రజలు ఇచ్చారు.ఎన్నికలకి ముందు ప్రత్యేక హోదా కోసం మీరు పోరాడింది నిజమైతే…(1/2) pic.twitter.com/dKNpMMQ3Qv
— Lokesh Nara (@naralokesh) June 16, 2022