Lokesh: సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించండి.. జగన్‌కు లోకేష్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లేఖ రాశారు. ఇసుక పాలసీ మార్చి భవన నిర్మాణ రంగాన్ని దానికి అనుబంధంగా ఉన్న 130కి పైగా వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేశారని ఆయన మండిపడ్డారు. వందలాది మంది భవననిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారకులయ్యారని ఆరోపించారు. అనాలోచిత విధానాలతో విద్యుత్ కోతలు ఆరంభించి పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు పంటలు వేయకుండా క్రాప్ హాలీడే పాటిస్తున్నారని తెలిపారు.
ఇప్పుడు ఆక్వా రంగం కూడా సంక్షోభంలో పడిందన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు, ఫీడ్ ధర అధికం కావడం, రొయ్యల ధర తగ్గిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆక్వా హాలీడే ప్రకటించాలని రైతులు తీసుకున్న నిర్ణయంపై సర్కారు ఇప్పటివరకూ స్పందించకపోవడం విచారకరమని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. ఆక్వారంగానికి మేలు చేస్తానని హామీలు ఇచ్చిన మీరు అధికారంలోకి వచ్చాక… ఫీడ్-సీడ్ యాక్ట్‌లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఆక్వా జోన్ పరిధిలోని రైతులకు మాత్రమే సబ్సిడీ పేరుతో 80 శాతం మందికి సబ్సిడీలు ఎత్తివేయడం ముమ్మాటికీ ఆక్వారైతులకు ద్రోహం చేయడమే అని అన్నారు.
Also Read
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
YSRTP : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారా ..? |
టీడీపీ ఇన్నిరకాలుగా ఆక్వారంగానికి ప్రోత్సాహం అందిస్తే, మీరు సబ్సిడీలు ఎత్తేసి సంక్షోభానికి కారకులయ్యారని లోకేష్ మండిపడ్డారు. ఆక్వారంగం పట్ల వైసీపీ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా కళ్లుతెరిచి ఆక్వా రైతుల డిమాండ్లన్నీ తక్షణమే నెరవేర్చకపోతే పరిశ్రమలు, వ్యవసాయరంగం దారిలోనే ఆక్వా హాలీడే కూడా తప్పకపోవచ్చన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!