ఇటీవల ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన పదో తరగతి ఫలిలాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులవి ఆత్మహత్యలు కావు ప్రిజనరీ జగన్ ప్రభుత్వ హత్యలే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. జగన్ రివర్స్ పాలనలో రివర్స్ రిజల్ట్స్ వచ్చాయని, టెన్త్ క్లాస్ రిజల్ట్స్ చూసిన తరువాత షాక్ కి గురయ్యానని తెలిపారు. కనీస అవగాహన లేని ప్రిజనరీ వ్యక్తి సీఎం అయితే ఎంత ప్రమాదమో చూస్తున్నామని ఆయన ఎద్దేవా చేశారు. ప్రిజనరీ జగనుకు చేతకాక విద్యా వ్యవస్థను నాశనం చేసారని ఆయన ఆరోపించారు. టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసి పరీక్షలు రాసిన జగన్‌కు విద్యార్థుల కష్టం ఏం తెలుస్తుంది..? అని ఆయన విమర్శించారు.
పరీక్షల నిర్వహణ నుండి రిజల్ట్స్ ప్రకటించే వరకూ అంతా గందరగోళమేనని, పదో తరగతి పరీక్షల్లో రీ-వాల్యూయేషన్, రీ-వెరిఫికేషన్ చేయాలన్నారు. రీ-వాల్యూయేషనుకు.. రీ-వెరిఫికేషనుకు ఎలాంటి ఫీజులు వసూలు చేయలేదని, విద్యార్ఖుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలే అంటూ ఆయన ఆరోపించారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ విద్యార్థుల తరపున పోరాడుతుందని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు మా వంతు సహాయం అందిస్తామని ఆయన వెల్లడించారు. పరీక్షల సమయంలో కూడా కరెంట్ కోతలు పెట్టిన చెత్త ప్రభుత్వం ఇది అని ఆయన మండిపడ్డారు. ఫెయిల్ అయ్యింది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కాదు.. జగన్ సర్కార్ ఫెయిల్ అయ్యిందంటూ ఆయన ధ్వజమెత్తారు.