వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షంలో.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు మంగళగిరికి చెందిన కీలక నేత గంజి చిరంజీవి.. 20 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పిన చిరంజీవి.. ఇవాళ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డితో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.. మరికొందరు ముఖ్యనేతలతో కలిసి సీఎం వైఎస్ జగన్‌తో సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా.. సీఎం సమక్షంలో వైసీపీలో చేరారు.. పార్టీ కండువా కప్పి గంజి…
తెలుగుదేశం పార్టీలో కీలకనేతగా ఉన్న మంగళగిరికి చెందిన గంజి చిరంజీవి.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆశిస్తున్న ఆయన.. గత ఎన్నికల్లో నారా లోకేష్ అక్కడి నుంచి పోటీ చేయడంతో.. ఆ సీటును త్యాగం చేయాల్సి వచ్చింది.. ఇక, లోకేష్ మంగళగిరిపై కేంద్రీకరించి పనిచేయడంతో.. తనకు ఆ స్థానం దక్కే అవకాశం లేకపోవడంతో.. టీడీపీకి గుడ్‌బై చెప్పారు.. కానీ, ఏ పార్టీలో చేరతారు అనేది మాత్రం స్పష్టం చేయలేదు.. కానీ,…
Nara Lokesh taken into custody in Srikakulam: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ను శ్రీకాకుళం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేష్ పలాసాలో పర్యటించనున్న నేపథ్యంలో శ్రీకాకుళం పట్టణంలోని కొత్త రోడ్డులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పలాసకు వెల్లకుండా లోకేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర ఆగ్రహంతో.. పార్టీ శ్రేణులు రోడ్డుపైనే లోకేష్ బైఠాయించారు. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. నారా లోకేష్ వాహనం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా మొహరించారు.…
నేడు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలాసాలో పర్యటించనున్న నేపథ్యంలో.. ఏంజరుగుతోందన్న టెన్షన్ నేపథ్యంలో.. నేడు శ్రీకాకుళం పట్టణంలోని కొత్త రోడ్డులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పలాసకు వెల్లకుండా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర ఆగ్రహంతో.. పార్టీ శ్రేణులు రోడ్డుపైనే లోకేష్ బైఠాయించారు. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. నారా లోకేష్ వాహనం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా మొహరించారు. అనుమతించాలని కోరుతూ.. రోడ్డు బైఠాయించి…
Nara Lokesh: ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఎనర్జీ అసిస్టెంట్లు, జేఎల్ఎం గ్రేడ్-2 ఉద్యోగుల సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు. ఎనర్జీ అసిస్టెంట్ల న్యాయమైన డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జాబ్ ఛార్ట్‌ని విస్మరించి కట్టుబానిసల్లా వాడుకోవడంతో ఎనర్జీ అసిస్టెంట్లు తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారని లోకేష్ ఆరోపించారు. సెలవులు, పండగలు, పబ్బాల ఊసే లేకుండా చేశారని.. దీంతో రాత్రి,…
Nara Lokesh: విజయవాడలో చిరు వ్యాపారులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సీఎం అయిన దగ్గర నుంచి చిరు వ్యాపారులను కూడా వదలకుండా దోచుకుంటున్నారని ఆరోపించారు. కరోనాను ఎదుర్కొన్నాం కానీ.. జగన్ వైరస్‌ను ఎదుర్కోలేకపోతున్నామని లోకేష్ చురకలు అంటించారు. ఏపీలో జగన్, అతని చుట్టుపక్కల ఉన్న నలుగురిదే రాజ్యం…
బాడీ లాస్ కోసం ప్రయత్నిస్తే మైండ్ లాస్ అయినట్టుంది అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై సెటైర్లు వేశారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. లోకేష్ చాలా అమాయకంగా మాట్లాడుతున్నాడు.. వెయ్యి కోట్ల పెట్టుబడితో ఉన్న పరిశ్రమలు ప్రారంభించటానికి తన తండ్రికి టైం ఉండేది కాదని లోకేష్ అంటున్నాడు.. బాడీ లాస్ కోసం ప్రయత్నించి లోకేష్ కు మైండ్ లాస్ అయ్యినట్టు ఉంది అని ఎద్దేవా చేశారు.. అన్ని…
ADR Report Report on AP MLC Assets: పెద్దల సభగా భావించే శాసనమండలిలో సగానికి పైగా సభ్యులు నేరచరితులే ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫర్మ్స్ తాజా నివేదిక వెల్లడించింది. ఏపీ శాసన మండలిలో ఉన్న 58మంది సభ్యుల్లో 48మంది వివరాలను విశ్లేషించిన తర్వాత అందులో 20మందికి పైగా ఎమ్మెల్సీలు క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నట్లు ఏడీఆర్ నివేదిక తెలియజేసింది. ప్రస్తుతం వైసీపీకి శాసనమండలిలో 26మంది సభ్యులున్నారు. వైసీపీకి చెందిన 13 మంది, టీడీపీకి చెందిన ఆరుగురు…