మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి జోగి రమేష్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కుప్పంలో కూడా చంద్రబాబు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ఆయన చేయించుకున్న సర్వేలో కూడా అదే తేలిందని.. చంద్రబాబు 175 సీట్లలో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ధైర్యం ఉంటే చెప్పాలి అని సవాల్ చేశారు. ఇక, కుప్పం, మంగళగిరిలో అబ్బాకొడుకులు ఇద్దరూ ఓడిపోతారని చెప్పుకొచ్చారు జోగి రమేష్.. పవన్ కల్యాణ్ మీద రెక్కీ చేయించాల్సిన పని ఎవరికి ఉంది? వారంతా చంద్రబాబు మనుషులే అని వ్యాఖ్యానించిన ఆయన.. ఏదైనా చేసి మా మీద బురద వేయాలనుకుంటున్నారేమో? అనే అనుమానాలు వ్యక్తం చేశారు.. మేం అభివృద్ధి సంక్షేమం గురించే మాట్లాడతాం.. వారిలాగ కుట్రలు పన్నే అవసరం మాకు లేదన్నారు.. దీనిపై తెలంగాణ పోలీసులు విచారణ జరపాలని కోరారు. ప్రజల నుండి వైసీపీని, జగన్ పై ప్రేమను ఎవరూ దూరం చేయలేరనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Read Also: Jogi Ramesh: పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర రెక్కీ.. ఇలా స్పందించిన మంత్రి జోగి రమేష్
ఇక, అయ్యన్న అక్రమించుకుంటే. అరెస్ట్ చేస్తారా? అని బాబు చెబుతున్నాడు. ఆక్రమణ తప్పు కాదా..? అని నిలదీశారు.. ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం తప్పే అని చెప్పి.. ఊగిపోతు మాట్లాడుతున్నాడు.. టీడీపీకి సొంత రాజ్యాంగం ఏమైనా రాశారా? అని ఎద్దేశా చేశారు. ప్రభుత్వ స్థలాలను అక్రమించుకుంటే ఒకే… కానీ, కేసు పెట్టకూడదా..? అని ప్రశ్నించారు.. లాగేసాను.. పీకేస్తాను అంటున్నాడు చంద్రబాబు.. ఏంటి వచ్చేది.. ఎవర్ని బెదిరిస్తున్నారు చంద్రబాబు? అంటూ ఫైర్ అయ్యారు. అయ్యన్న పాత్రుడు 420 పని చేస్తే బీసీలకు ఏం సంబంధం? అని సెటైర్లు వేశారు. చంద్రబాబు ఎంత లేపినా టీడీపీ లేవదు.. బీసీలను రెచ్చగొట్టాలని బాబు చూస్తున్నాడని ఆరోపణలు గుప్పించారు మంత్రి జోగి రమేష్.