Vijayasai Reddy Tweet on Chandrababu Comments: ఇవే తన చివరి ఎన్నికలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే.. ఏం పీకావంటూ చంద్రబాబుని నిలదీశారు. చివరి ఛాన్స్ ఇవ్వాలంటూ మళ్లీ కొత్త బిచ్చగాడిలా జనం మీద పడ్డావంటూ ఎద్దేవా చేశారు. కుల పిచ్చితో మూడు దశాబ్దాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావని, ఇక ఈ జన్మకి మళ్లీ ముఖ్యమంత్రి కాలేవని ఘాటుగా స్పందించారు. అంతకుముందు కూడా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు క్షుద్ర విద్యలు నేర్చిన నాగుపాము అని.. భూముల్ని కబళించే టీడీపీ కాలనాగుల్ని ప్రభుత్వం అడ్డుకోవడం వల్ల ఇప్పుడు బుసలు కొడుతూ విషం చిమ్ముతోందని విమర్శించారు. పందులు అశుద్ధం తిన్నట్లు.. ప్రభుత్వ భూముల్ని కాజేయడమే చంద్రబాబు, లోకేష్‌తో పాటు ఇతర టీడీపీ నేతల పని అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుక్క నుంచి ముక్క లాగేస్తే ఎలా అరుస్తుందో.. టీడీపీ నేతలు అలాగే అరిచినట్లే మొరుగుతున్నారని ధ్వజమెత్తారు.
అలాగే.. ఉత్తరాంధ్రకు చంద్రబాబు వచ్చిన సమయంలోనూ ఆయనపై విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబుకు ఏం పని అని, వేల ఎకరాల ఆసామి గీతం మూర్తి ఎక్కడి నుంచి వచ్చాడని ప్రశ్నించారు. చంద్రబాబుతో పాటు ఆయన దొంగల ముఠా కళ్లన్నీ విశాఖ వనరుల మీదే ఉంటాయని ఆరోపించారు. పేదలు వలసపోతుంటే ఆనందించారని, పరిశ్రమలు పెడతామని వస్తే బాబు అమరావతికి రమ్మనేవాడని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్రబాబు హయాంలోనే బీజం పడిందని.. రక్షకులెవరో, భక్షకులేవరో ప్రజలకు తెలుసని చెప్పారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏ క్షణమైనా జగన్, విజయసాయి రెడ్డి అరెస్ట్ కావొచ్చని బొండా ఉమా మహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. బెజవాడ ప్రజలు బండికేసి బాదినా తీరు మారలేదని, దున్నపోతులాంటి కొడుకుని రోడ్డు మీదకి వదిలి పాదచారుల ప్రాణాలు తీసినప్పుడు పోలీసులు బూట్లు నాకిన రోజుల్ని మర్చిపోయారా? అని నిలదీశారు.
మూడుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏమి పీకావ్ చంద్రం? చివరి ఛాన్స్ ఇవ్వాలంటూ మళ్లీ కొత్త బిచ్చగాడిలా జనం మీద పడ్డావు. కుల పిచ్చితో రాష్ట్రాన్ని 3 దశాబ్దాలు సర్వనాశనం చేశావు. ఈ జన్మకి మళ్ళీ ముఖ్యమంత్రి కాలేవు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 17, 2022