కర్నూలు జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చగా మారాయి.. ఇవే నాకు చివరి ఎన్నికలు అంటూ ఆయన చేసిన కామెంట్లపై కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. తునిలో మీడియాతో మాట్లాడిన మంత్రి దాడిశెట్టి రాజా… చంద్రబాబుకి గ్రౌండ్ రియాల్టీ ముందే అర్థమైంది.. 2019 ఎన్నికల్లో లాగానే 2024 ఫలితాలు ఉంటాయని ముందే అర్ధం చేసుకున్నాడు.. 2024 ఎన్నికలను కూడా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినట్టుగానే చేయపోతున్నాడు అంటూ సెటైర్లు వేశారు.. రాష్ట్ర ప్రజలు ఉమ్ము వేయపోతున్నారని చంద్రబాబుకి అర్థమైపోయిందన్న ఆయన.. ఎన్నికలకు ముందే కొడుకుతో కలిసి చంద్రబాబు సింగపూర్ పారిపోతాడని ఎద్దేవా చేశారు.
ఇక, దత్త పుత్రుడు (పవన్ కల్యాణ్)తో ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు మాట్లాడించినా.. ఆయన తిరస్కరించారని వ్యాఖ్యానించారు మంత్రి దాడిశెట్టి రాజా.. ఎన్నికల్లో పోటీ చేసేస్థాయి, సత్తా తెలుగుదేశం పార్టీకి లేదని కామెంట్ చేశారు.. నారా లోకేష్ టీడీపీ హాఫ్ నిక్కరు గాడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.. తుని వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని.. వ్యక్తులు మీద దాడి చేసే సంస్కృతి మాది కాదని హితవుపలికారు.. యనమల రామకృష్ణుడు వంటి లోఫర్ గాడి వలన తునిలో 40 మంది హత్యకు గురయ్యారని ఆరోపించారు.. తుని అభివృద్ధి కోసం ఒక ఆర్గనైజేషన్ నడుస్తుంది.. క్రమంగా తునిని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు మంత్రి దాడిశెట్టి రాజా.. కాగా, అసెంబ్లీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ఇవే నా చివరి ఎన్నిక అని పేర్కొన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.. గౌరవ సభ కాదని, అది కౌరవ సభ అని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ అసెంబ్లీలో నన్ను, నా భార్యను కూడా అవమానించారని పేర్కొన్నారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే అని, లేదంటే ఇదే తన చివరి ఎన్నిక అని చెప్పారు. తనను గెలిపిస్తే ఈ కౌరవ సభను మళ్లీ గౌరవ సభ చేస్తా నంటూ చంద్రబాబు చేసిన కామెంట్లు సంచలనంగా మారిన విషయం విదితమే.