మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారు మంత్రి మేరుగ నాగార్జున… ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని చంద్రబాబు అన్నారని మండిపడ్డారు.. దీనిపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం పాదాల వద్ద చంద్రబాబు ముక్కు నేలకేసి రాయాలి, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.. లేదంటే నారా లోకేష్ పాదయాత్రని అడ్డుకుంటామని హెచ్చరించారు.. ఇక, వంగవీటి మోహన రంగా హత్య కేసులో చంద్రబాబు ప్రధాన ముద్దాయి అని సంచలన ఆరోపణలు చేశారు.. మరోవైపు, అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శలు గుప్పించారు.
Read Also: Chandrababu: రాష్ట్రంలో సైకిల్ గాలి వీస్తోంది..!
ఇక, పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటే దమ్మున్న రాజకీయం చేయాలని సలహా ఇచ్చారు మంత్రి మేరుగ నాగార్జున.. పవన్ బస్సు యాత్ర ఎవరి కోసం చేస్తున్నాడు..? అని నిలదీసిన ఆయన.. సమాధానం చెప్పలేనివాళ్లు యాత్రల పేరుతో వస్తున్నారని ఎద్దేవా చేశారు.. ఎవరు ఏం చేసినా.. 2024 ఎన్నికల్లో తిరిగి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు.. పవన్ కల్యాణ్ ఆరోపణలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మంత్రి.. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఏ ప్రభుత్వంలో అయినా పవన్ కల్యాణ్.. ఇలాంటి కాలనీలు చూశారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఎవరికి లబ్ధి చేకూరుస్తున్నారో పవన్ తెలుసుకోవాలన్నారు. తెలంగాణ వాళ్ల కోసం ఆలోచించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేసిన ఆయన.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అభివృద్ధికి ఉపయోగపడే వారు.. నరేంద్ర మోడీయా? అమిత్ షానా? అనేది తమకు అనవసం.. రాష్ట్ర అభివృద్దే ముఖ్యమని ప్రకటించారు మంత్రి మేరుగ నాగార్జున.