Unstoppable 2 : 24గంట్లో వన్ మిలియన్ వ్యూస్.. బాలయ్య సెన్సేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unstoppable 2 : బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఒక్క రోజులో మిలియన్ వ్యూస్ సాధించింది. ప్రోమో కూడా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. నట సింహం నందమూరి బాలకృష్ణ రికార్డుల పరంపర డిజిటల్ తెరపై కూడా కంటిన్యూ అవుతోంది. ‘ఆహా’ ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందిన టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’తో ఆయన డిజిటల్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇచ్చారు. ఆ టాక్ షో ఐఎంబీడీలో హయ్యస్ట్ రేటెడ్ టాక్ షోగా నిలిచింది. ఇప్పుడు ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ సెకండ్ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోతో రికార్డుల వేట మొదలు పెట్టారు బాలయ్య బాబు. రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు , ఆయన కుమారుడు లోకేష్ అతిథులుగా వచ్చారు. వీళ్ళు బాలకృష్ణకు బంధువులు కావడతో ఈ ఎపిసోడ్ పై అందరూ ఆసక్తిని కనబరిచారు.
Read Also: Billa Special Show: ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ రోజు ముందే దీపావళి!
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2’ ఫస్ట్ ఎపిసోడ్‌లో బావ, అల్లుళ్లతో బాలకృష్ణ ఫ్యామిలీ విషయాలతో పాటు పొలిటికల్ అంశాలను కూడా డిస్కస్ చేశారు. నందమూరి కుటుంబానికి, టీడీపీ స్థాపకుడు ఎన్టీఆర్ ప్రస్తావన కూడా షోలో వచ్చింది. ఎపిసోడ్‌లో సంచలనాలు ఉన్నాయని ప్రోమోతోనే క్లారిటీ ఇచ్చారు. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2’ ఫస్ట్ ఎపిసోడ్‌కు 24 గంటల్లో పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయని ఆహా ఓటీటీ వెల్లడించింది. సెన్సేషనల్ ఎపిసోడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోందని, నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో ఓటీటీ రికార్డులు తిరగరాస్తున్నారని పేర్కొంది. మరోవైపు యూట్యూబ్‌లో కూడా ప్రోమో రికార్డుల మోత మోగిస్తోంది. మూడు రోజులుగా టాప్ ట్రెండ్స్ లో ఉంది.
Read Also: Prabhas: అభిమానులకు గుడ్ న్యూస్.. డ్యూయల్ రోల్లో ప్రభాస్
‘అన్‌స్టాపబుల్ 2’లో ఒక ఎపిసోడ్‌లో యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ సందడి చేయనున్నారు. వీళ్ళిద్దరి ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అది విడుదల విడుదల అయ్యేది త్వరలో ప్రకటించనున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన టీజర్, ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంది.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!