ఈరోజు ముంబై, కోల్‌కతా జట్ల మధ్య అబుదాబి వేదికగా మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, డీకాక్‌లు రాణించడంతో భారీ స్కోర్ సాధిస్తుందని అనుకున్నారు. అయితే, ఓపెనర్లు ఔటయ్యాక మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించకపోవడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 155 పరుగులు మాత్రమే చేసి కోల్‌కతా ముందు 156 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రోహిత్ శర్మ 33, డీకాక్ 55 పరుగులతో రాణించగా, సూర్యకుమార్ యాదవ్ 5, ఇషాన్ కిషన్ 14, కృనాల్ పాండ్య 12, కీరన్ పొలార్డ్ 21 పరుగులు చేశారు.
Read: ఆత్మనిర్భర్ భారత్: రక్షణ శాఖ కీలక నిర్ణయం… 118 అర్జున ట్యాంక్‌లకు ఆర్డర్…