‘అన్ లాక్ సినిమా, సేవ్ జాబ్స్’ అంటున్న మహారాష్ట్ర ఎగ్జిబిటర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే అతిపెద్ద సినిమా రంగం బాలీవుడ్! దానికి కేంద్రం ముంబై! కరోనా సెకండ్ వేవ్ తర్వాత వివిధ రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు పునః ప్రారంభమైనా మహారాష్ట్రలో మాత్రం ప్రభుత్వం ససేమిరా అంటోంది. దీంతో తమకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోందని మహారాష్ట్ర మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు వాపోతున్నారు. నెలకు నాలుగు వందల కోట్ల నష్టం వస్తోందని, గత యేడాది మార్చి నుండి ఇప్పటి వరకూ సుమారు రూ. 4, 200 కోట్ల రూపాయలు లాస్ వచ్చిందని వారు చెప్పారు. ‘అన్ లాక్ మహారాష్ట్ర’లో భాగంగా ఇటీవల లోకల్ ట్రైన్స్, బీచ్ లు, పార్కులను కూడా ఓపెన్ చేసేశారు. కానీ సినిమా థియేటర్ల విషయంలో మాత్రం ప్రభుత్వం చొరవ చూపడం లేదు.
ఇప్పటికే మాల్స్, ఎయిర్ లైన్స్, రైల్వేస్, రీటైల్స్, జిమ్స్ కు ప్రభుత్వం పచ్చజెండా ఊపేసింది. ఇప్పుడు కూడా అన్ని జాగ్రత్తలూ తీసుకుని, సినిమాలను ప్రదర్శిస్తామంటే తమకు అవకాశం ఇవ్వడం లేదని ఎగ్జిబిటర్స్ వాపోతున్నారు. కోట్లాది మందికి వినోదాన్ని అందించేది సినిమానే అని, అలానే ఈ రంగంపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని చెబుతున్నారు. ‘అన్ లాక్ సినిమా, సేవ్ జాబ్స్’ నినాదంతో తమను ఆదుకోమంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఓ విజ్ఞాపన ప్రతాన్ని మంగళవారం పంపారు. సినిమా ప్రదర్శన సమయంలో తీసుకునే జాగ్రత్తలన్నింటినీ అందులో పొందుపరిచారు. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో భాగమైన పీవీఆర్, ఐనోక్స్, సినీపోలిస్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ చేసిన ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం ఎంతవరకూ పట్టించుకుంటుందో చూడాలి.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం

తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..