త్వరలోనే ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టింది. ఎవర్ని ముంబై మేయర్ అభ్యర్ధిగా ప్రకటించాలి అనే విషయంపై పార్టీ ఓ డాక్యుమెంట్‌ను రూపోందించింది. ఇందులో వ్యాపారవేత్తలు, స్టార్టప్ సీఈవోలు, ప్రముఖ సినీ నటుల పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి విలాస్‌దావు దేశ్ ముఖ్ తనయుడు రితేష్ దేశ్‌ముఖ్, ప్రముఖ సినినటుడు మోడల్ మిలింద్ సోమన్, బాలీవుడ్ నటుడు సోనూసూద్ పేర్లను కూడా ఆ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. ముంబై మేయర్ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి రాజకీయలకు సంబందించి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా జనాల్లో పాపులారిటి ఉన్న వ్యక్తి కోసం కాంగ్రెస్ పార్టీ సెర్చ్ చేస్తున్నది. ప్రస్తుతం పార్టీ మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీతో కలిసి సంకీర్ణప్రభుత్వంలో ఉన్నది. అయితే, ముంబై ఎన్నికల్లో ఆ పోత్తులోనే పనిచేస్తారా లేదంటే ఒంటరిగా పోటీ చేస్తుందా అన్నది తెలియాల్సి ఉన్నది. ముంబై కార్పోరేషన్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఒక్క కార్పోరేటర్ కూడా లేకపోవడంతో ముందునుంచే అలర్టైన కాంగ్రెస్ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టింది. అందరికంటే ముందుగా 142 మంది కార్పోరేటర్ అభ్యర్ధులను, మేయర్ అభ్యర్ధినీ ప్రకటించేందుకు కసరత్తులు ప్రారంభించింది. త్వరలోనే పార్టీ ముంబై కార్పోరేషన్ అభ్యర్ధుల లిస్టును కాంగ్రెస్ అధిష్టానం ముందుకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నది.