ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత పొదుపుగా బౌలింగ్ చేసింది. అయితే చివర్లో భారీగా పరుగులు సమర్పించుకుంది. దీంతో 20 ఓవర్లకు కోల్‌కతా జట్టు 175/8 స్కోరు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 176 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లో నితీష్ రానా(54) హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ చివర్లో రసెల్(49 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్…
ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. గురువారం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఇప్పటివరకు రెండు జట్లు చెరో 4 మ్యాచ్ లు ఆడి, 3 విజయాలు సాధించి ఊపుమీదున్నాయి. మెరుగైన రన్ రేట్ తో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇవాళ్టి మ్యాచ్ లో గుజరాత్ గెలిస్తే అత్యధిక విజయాలతో పాయింట్ల పట్టికలో ప్రథమస్థానానికి ఎగబాకుతుంది. అందుకే రెండు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు…
ముంబైలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ… శరద్‌పవార్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. బారికేడ్లు తీసుకొని లోపలికి వెళ్లారు. శరద్ ఇంటిపై చెప్పులతో దాడి చేశారు. గతేడాది నవంబర్ నుంచి సమ్మే చేస్తున్నా… శరద్ పవర్ పట్టించుకోలేదని ఆరోపించారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని ఫైరవుతున్నారు కార్మికులు. Read Also: Sri Ram Navami: భైంసాలో శోభాయాత్ర.. హైకోర్టు కీలక ఆదేశాలు.. కాగా, ప్రభుత్వ ఉద్యోగుల్లా గుర్తించాలంటూ… మహారాష్ట్ర ఆర్టీసీ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మర్చి 25 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన తొలి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సందర్భంగా ముంబైలో హిందీ డిస్ట్రిబ్యూటర్ పెన్ స్టూడియోస్ జయంతి లాల్ గడ గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో…
ఫస్ట్ వేవ్.. సెకండ్ వేవ్.. థర్డ్ వేవ్… వరుసగా మూడు కరోనా వేవ్‌లను చేశాం.. ఈ సమయంలో.. ఎన్నో వేరియంట్లు వెలుగు చూశాయి.. కొన్ని ప్రమాదకరంగా మారగా.. కొన్ని అంతగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. అయితే, ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి తగ్గుతోన్న తరుణంలో… కొత్తరకం వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్తరకం ఎక్స్ఈ వేరియంట్ భారత్‌లోనూ వెలుగుచూసింది. తొలి కేసు ముంబైలో నమోదైనట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. అంతేకాకుండా కప్పా…
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ టెన్షన్ కాస్త తగ్గిపోయింది… భారత్‌లోనూ అన్ని ఆంక్షలు ఎత్తివేసింది ప్రభుత్వం.. పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుతూ పోవడంతో.. కరోనా సమయంలో విధించిన రకరాల ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తూ వచ్చింది.. అయితే, భారత్‌లో కొత్తగా వెలుగు చూసిన కరోనా వేరియంట్ కలకలం సృష్టిస్తోంది.. ఒమిక్రాన్ రూపంలో భారత్‌లో థర్డ్ వేవ్ ప్రారంభమై మరోసారి కలవరపెట్టిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు ముంబైలో ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్ఈ తొలి కేసు నమోదైంది. దీంతో.. కేంద్ర ఆరోగ్య శాఖ…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాగచైతన్యతో విడాకుల తరువాత జోరు పెంచిన ఈ భామ భాషతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని చేతినిండా సంపాదిస్తుంది. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో తాను, చైతన్య ఎంతో ఇష్టంగా కట్టించుకునేం ఇంట్లోనే ఉంటున్న సామ్.. మరో ఇంటిది కాబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఎక్కువగా సామ్ బాలీవుడ్ సినిమాలను ఓకే చేస్తున్న సంగతి విదితమే.. ఇక అందుకోసం ప్రతిసారి…
రేపు ఐపీఎల్-15 వ సీజన్ ప్రారంభం కానుంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై-కోల్‌కతా మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఉగ్రవాదులు ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లను టార్గెట్ చేసినట్లు సమాచారం. క్విక్ రెస్పాన్స్ బాంబ్ స్వ్కాడ్ టీం ఇచ్చిన హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొందరు ఉగ్రవాదులు మారువేశంలో మ్యాచ్‌లు జరగనున్న స్టేడియాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. దీంతో స్టేడియాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. మరోవైపు, ఐపీఎల్…
దేశంలో అత్యధిక మంది కోటీశ్వరులు ఉన్న నగరాల్లో మన హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. దేశంలో కోటీశ్వరుల విషయంలో దిగ్గజ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ సర్వే చేసింది. ఈ జాబితాలో ముంబై తొలి స్థానంలో నిలిచింది. ఫార్మా, బయోటెక్ రంగాలతో పాటు ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరంలో కోటీశ్వరులు సంపదను వెనకేసుకోవడంలో దూసుకుపోతున్నారు. దాదాపు రూ.220 కోట్ల సంపద ఉన్నవాళ్లు హైదరాబాద్ నగరంలో 467 మంది ఉన్నారని నైట్ ఫ్రాంక్ సర్వే…