ప్రస్తుతం సమంత చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే అక్కడ ఒకటి, అరా సినిమాలకు, వెబ్ సిరీస్‌కు సైన్ చేసింది. అలానే ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఓకే చేసింది. అయితే ఇవన్నీ కూడా ముంబైలో ఉంటూ ఆపరేట్ చేస్తోంది సమంత. ఈ నేపథ్యంలో సామ్ ముంబైకి మకాం మార్చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ టాప్ సెలబ్రిటీ కాలనీలో సమంత ఓ ఖరీదైన ప్లాట్ తీసుకుందని వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు టోటల్‌గా అక్కడికే షిప్ట్ అయిపోయినట్టు సమాచారం. ఇంతకు ముందు సామ్ పయనం హైదరాబాద్ టు చెన్నై సాగగా.. ఇప్పుడు చెన్నై టూ ముంబాయిగా సాగుతోందట. షూటింగ్‌లో ఏ మాత్రం గ్యాప్ దొరికినా ముంబాయిలోనే వాలిపోతోందట అమ్మడు. అవసరమైతే తప్పా హైదరాబాద్‌కు రావడం లేదట. దాంతో సమంత పూర్తిగా ముంబైకి మకాం మార్చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామ్.. రీసెంట్‌గా తన పెట్స్‌తో దిగిన ఓ ఫోటో షేర్ చేసింది. దానికి ఓ నెటిజన్ స్పందిస్తూ.. సమంత తన పెట్స్ కుక్కలు, పిల్లులతో ఒంటరిగా చనిపోవాలి.. అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి సమంత కూల్‌గా అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ‘అలా జరిగితే అంతకన్నా మరో అదృష్టం ఉండదని.. రిప్లై ఇచ్చింది. దాంతో సదరు నెటిజన్ ఆ ట్వీట్ ని వెంటనే డిలీట్ చేసేశాడు. అయితే ఇదంతా చూసిన తర్వాత.. సమంత నిజంగానే ఒంటరిగానే ఉండిపోతుందా.. అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే సామ్ ఇలాంటి విషయాల్లో పాజిటివ్‌గా స్పందించడంతో.. గట్టిగా కౌంటర్ ఇచ్చిందని అంటున్నారు నెటిజన్స్. ఇక సమంత దగ్గర రెండు కుక్కలు ఉన్న సంగతి తెలిసిందే. దాంతో షూటింగ్ లేకపోతే వాటితోనే సమయం గడుపుతుంటుంది సామ్. ఏదేమైనా సమంత ఏది చేసినా సెన్సేషనే అని చెప్పొచ్చు.