మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరుకుంది.. రెబల్ ఎమ్మెల్యేలు కోరితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సీఎం ఉద్దవ్ థాక్రే.. శివసేన చీఫ్ పదవిని కూడా వదులుకుంటానని ప్రకటించారు.. అయితే, తాను చేసిన తప్పేంటో చెప్పాలని కోరారు.. తనకు నమ్మకద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. రాజీనామాకు సిద్ధం.. రాజీనామా లేఖ కూడా రెడీగా ఉందని వెల్లడించారు.. అయితే, రాజీనామాపై ప్రకటన చేయకుండానే.. సీఎం అధికారిక నివాసం వర్షను ఖాళీ చేశారు ఉద్దవ్ థాక్రే.. తన వస్తువులన్నీ సర్దేసుకొని స్వగృహమైన మాతోశ్రీకి చేరుకున్నారు.. ఈ పరిణామాలు చూస్తుంటే.. మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగినట్టే కనిపిస్తున్నాయి.. అధికారిక నివాసం ఖాళీ చేశారంటే.. అధికారాన్ని కూడా వదులుకుంటారని ప్రచారం సాగుతోంది.
Read Also: TS REDCO: కేసీఆర్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన సతీష్‌రెడ్డి..
మరోవైపు, ఉద్దవ్ థాక్రేకు కీలక సూచనలు చేశారు మంత్రి, రెబల్ ఎమ్మెల్యేలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే.. శివసేన లైన్ ఎప్పుడూ హిందుత్వమేనంటూ స్పష్టం చేసిన థాక్రే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే నమ్మక ద్రోహం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, తాను చేసిన తప్పేంటో చెప్పాలని రెబల్ ఎమ్మెల్యేలను డిమాండ్ చేశారు.. దీనిపై స్పందించిన ఏక్‌నాథ్ షిండే.. పార్టీ మనుగడ కోసం అసహజమైన ఫ్రంట్ నుండి బయటపడటం చాలా అవసరం అని పేర్కొన్నారు.. ప్రస్తుతం షిండేతోపాటు సుమారు 38 మంది శివసేన ఎమ్మెల్యేలు గువాహతిలోని హోటల్‌లో బస చేశారు.. అక్రమంగా ఏక్‌నాథ్ షిండేకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది.