ఢిల్లీలో రాజ్యసభ బీజేపీ సభ్యులు జీవీఎల్ నరసింహరావు ఎన్టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఏపీలో తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏ మాత్రం ఉండదని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎన్నికల్లో ఫలితాలను నిర్ధారిస్తాయని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం ప్రభావం ఇంకో రాష్ట్రంపై పెద్దగా ఉండదని జీవీఎల్ చెప్పారు. తెలంగాణలో వచ్చే లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. తెలంగాణలో కనీసం 14 లోక్ సభ స్థానాల్లో గెలిచేలా బీజేపీ…
విజయవాడ- ఢిల్లీ మధ్య విమానాల రాకపోకలు పెంచాలని కేంద్ర మంత్రికి, విమానయాన సంస్థలకు ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభ్యర్థించారు. విజయవాడ- ఢిల్లీ మధ్య విమానాల సంఖ్య తగ్గించడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎంపీ అన్నారు. ఎంతోమందికి ఉపయుక్తంగా ఉన్న విజయవాడ-ఢిల్లీ మధ్య విమానాల సంఖ్యను పెంచాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఏయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్ లైన్స్, మరియు స్పైస్ జెట్ వంటి విమానయాన సంస్థలకు లేఖలు రాశారు బీజేపీ ఎంపీ జీవీఎల్…
ఏపీలో మూడురాజధానుల అంశం ఎప్పుడైనా హాట్ టాపిక్. విశాఖలో పాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అంటూ అప్పటివరకూ వున్న అమరావతి రాజధానిని వికేంద్రీకరించాలని ప్రభుత్వం భావించింది. అయితే న్యాయపరమయిన ఇబ్బందుల నేపథ్యంలో బిల్లుని వెనక్కి తీసుకుంది. సమగ్రమయిన విధానంతో, ఎలాంటి న్యాయపరమయిన చిక్కులు లేకుండా వుండేలా మూడురాజధానుల బిల్లు తేవాలని భావిస్తోంది ప్రభుత్వం. మూడు రాజధానులనేది ఇక రాజకీయ నివాదంగానే ఉంటుందన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు. మూడు రాజధానుల…
ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారనుందా? అధికార పార్టీతో బీజేపీ ఇక అమీతుమీ తేల్చుకోనుందా? అందుబాటులో ఉన్న ఏపీ బీజేపీ ముఖ్య నేతల భేటీ వాడివేడిగా సాగింది. బీజేపీ కార్యాలయంలో సమావేశమైన సోము వీర్రాజు, జీవీఎల్, ఐవైఆర్, సత్య కుమార్ పలు అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వ విధానాలపై ఇక యుద్దం చేయాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు కమలనాధులు. తెలంగాణ బీజేపీ తరహాలో ఇకపై ఢీ అంటే ఢీ అన్నట్టు వ్యవహరించాలని భావిస్తోంది ఏపీ బీజేపీ. కేంద్ర నిధులతో అమలు చేసే పథకాలకు…