దేశవ్యాప్తంగా పాదయాత్రల హడావిడి నడుస్తోంది. తెలంగాణలో ఈపాదయాత్రలు వాడివేడిని రాజేస్తున్నాయి. తాజాగా ఏపీలోనూ బీజేపీ జనంలోకి వెళ్లాలని నిర్ణయించింది. ఏపీలో 15 రోజులపాటూ ప్రజా పోరు యాత్రకు సిద్ధమైంది బీజేపీ. 17వతేది నుంచి అక్టోబర్ 2 వతేది వరకు ప్రజాపోరు యాత్ర నిర్వహించాలని బీజేపీ నిర్ణయించిందన్నారు రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఏపీ లో 5 వేల సభలు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశాం.
వైసీపీ ప్రజా వ్యతిరేక విధానం, బలహీనమైన ప్రతిపక్షం కారణంగా బీజేపీ ప్రజా సమస్యల పై పోరాటం చేస్తోంది.రాష్ట్రంలో బూతులు తప్ప ఏమీ లేవు.. వైసీపీ వచ్చిన దగ్గర నుంచి మూడు రాజధానులు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కోర్టులు కూడా రాజధాని పై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అమరావతి పై రాజధాని చర్చ అంటూ డ్రామాలు ఆడుతున్నారని జీవీఎల్ విమర్శించారు. మూడు రాజధానులు కావని జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు.
Read Also: Cm Jaganmohan Reddy: ప్రతి ప్రాంతం బాగుండాలి..అమరావతిపై కోపం లేదు
అమరావతి రాజధాని నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని పలు సంస్థలకు లేఖ రాశాను. ఆర్బీఐ నాకు లేఖ రాసింది…..రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడం లేదని చెప్పారు. ఎస్.బి ఐ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకారం అందించడం లేదని చెప్పింది. కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్మణాలు చేపట్టడం లేదు. సిపిడబ్ల్యుడి స్థలాలకు నిధులు కేటాయించారు..వారికి మౌళిక సదుపాయాలు లేవని అంటున్నారు. రాజధాని అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం,ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు.
ప్రజా పొరుతో రాష్ట్రంలో బీజేపీ త్వరలో 5 వేల సభలు నిర్వహిస్తుంది. జగన్ ఇచ్చిన వాగ్దానాలు, నిలబెట్టుకొని హామీలు అన్నిటిని ప్రజల వద్ద ఎత్తిచూపుతాము. అసెంబ్లీలో కూడా ఈరోజు రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని అంటున్నారు, ఎందుకు విచారణ జరపడం లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో ఎస్ఐటిని ఏర్పాటు చేశారు,రిపోర్టు ఏమైంది. ఎస్ఐటి రిపోర్టును బయటపెట్టాలి అని డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నంలో 30 వేల మంది సామాన్య ప్రజల ప్లాట్లు ,22 a నిబంధన తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ ఆపేశారు,ప్రజల్ని హింసిస్తున్నారు. అమరావతి రైతులకు బీజేపీ పూర్తి మద్దతు తెలిపింది
హైకోర్టు రాయలసీమలో పెట్టాలనే అంశానికి మా మద్దతు ఉంది.రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది.రాష్ట్ర ప్రభుత్వం తో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు ఎంపీ జీవీఎల్. రాష్ట్రంలో ఎవరికి నచ్చకపోయినా సీబీఐ ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సిబిఐ ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా తమ బాధ్యత నిర్వహిస్తుంది. జీవీఎల్ తెలంగాణ సచివాలయంపై మాట్లాడారు. తెలంగాణ కు దళిత ముఖ్యమంత్రి ని చేస్తే, అసలయిన సాధికారత వచ్చేదన్నారు ఎంపీ జీవీఎల్.
Read Also: Talasani Srinivas Yadav : తెలంగాణ సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు.. సీఎం కేసీఆర్ నిర్ణయం హర్షణీయం