ఢిల్లీలో రాజ్యసభ బీజేపీ సభ్యులు జీవీఎల్ నరసింహరావు ఎన్టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఏపీలో తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏ మాత్రం ఉండదని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎన్నికల్లో ఫలితాలను నిర్ధారిస్తాయని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం ప్రభావం ఇంకో రాష్ట్రంపై పెద్దగా ఉండదని జీవీఎల్ చెప్పారు. తెలంగాణలో వచ్చే లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. తెలంగాణలో కనీసం 14 లోక్ సభ స్థానాల్లో గెలిచేలా బీజేపీ ప్రణాళికలు సిద్దం చేస్తోందని తెలిపారు.
Big Breaking: గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
మరోవైపు.. పొత్తులపై మాట్లాడుతూ బీజేపీతో జనసేన పొత్తులో ఉందని.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసిందని జీవీఎల్ చెప్పారు. ఏపీలో టీడీపీతో “బీజేపీ-జనసేన”కు పొత్తు ఉంటుందా.. లేదా అన్నది కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పొత్తుపై ఆలోచన చేయకుండా.. ప్రస్తుతం బీజేపీ కార్యకర్తలు, నాయకులు క్షేత్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం అమలయ్యేలా ప్రజలకు సహాయం చేయడం నిరంతరం కొనసాగించాలని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం ద్వారా ఏపీలో ఆ పార్టీకి ఏ మాత్రం ప్రయోజనం ఉండదని ఆరోపించారు. కాగా.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఇక కష్టమని విమర్శించారు.
Big Breaking: గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
ఇదిలా ఉంటే.. విశాఖ “గ్రోత్ హబ్” ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆర్ధికాభివృద్ధి సాధించేందుకు కేంద్రం ప్రణాళికలు చేస్తోందని జీవీఎల్ తెలిపారు. దేశంలో వారణాసితో పాటు, సూరత్, ముంబై, విశాఖపట్నం నగరాలను కేంద్రం ప్రత్యేకంగా ఎంపిక చేసిందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో విశాఖపట్నం ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. దీనితో ఏపీలో ఉపాధి ఉద్యోగావకాశాలు పెరగడం, పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా వస్తాయని జీవీఎల్ పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయం వల్ల ఏపీకి పెద్ద ఎత్తున పలు ప్రయోజనాలు జరుగుతాయని అన్నారు. “గ్రోత్ హబ్” ద్వారా వచ్చే రెండు దశాబ్దాల్లో సమగ్ర ఆర్ధిక ప్రగతి సాధించే వీలుందని తెలిపారు. కాగా.. పర్యవేక్షణ బృందంలో తనను కూడా ఓ సభ్యుడిగా నియామకం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.