ఏపీలో మూడురాజధానుల అంశం ఎప్పుడైనా హాట్ టాపిక్. విశాఖలో పాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అంటూ అప్పటివరకూ వున్న అమరావతి రాజధానిని వికేంద్రీకరించాలని ప్రభుత్వం భావించింది. అయితే న్యాయపరమయిన ఇబ్బందుల నేపథ్యంలో బిల్లుని వెనక్కి తీసుకుంది. సమగ్రమయిన విధానంతో, ఎలాంటి న్యాయపరమయిన చిక్కులు లేకుండా వుండేలా మూడురాజధానుల బిల్లు తేవాలని భావిస్తోంది ప్రభుత్వం.
మూడు రాజధానులనేది ఇక రాజకీయ నివాదంగానే ఉంటుందన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు. మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యం కాదు. మూడు రాజధానులు సాధ్యం కాదని తెలుసు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్ల లేదు. రాజధాని అమరావతిలో పనులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డు పడుతోందని జీవీఎల్ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలకు అనువైన వాతావరణం కల్పించేలా ఏపీ ప్రభుత్వం ముందుకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకేసారి రూ. 50-60 వేల కోట్లు ఖర్చు పెట్టమని అడగడం లేదు.. అది సాధ్యం కూడా కాదు. కేంద్ర సంస్థలకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతి భవనాల నిర్మాణం చేపట్టేలా ఆయా సంస్థలకు ఇప్పటికే లేఖలు రాశాం. కేంద్ర సంస్థల భవనాల నిర్మాణం జరిగేలా మా వంతు కృషి చేస్తాం. అమరావతిలోనే రాజధాని ఉండాలనేది బీజేపీ నిర్ణయం అన్నారు జీవీఎల్ నరసింహారావు.
Jc Vs Palle: జేసీపై మండిపడుతున్న పల్లె