ఏపీలో వైసీపీ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. MP జీవీఎల్ నరసింహారావు కు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఛాలెంజ్ విసిరారు. విభజన హామీలు సహా కేంద్రం ఇవ్వాల్సిన ప్రాజెక్టులపై జీవీఎల్ తో చర్చకు తాను సిద్ధం అన్నారు మంత్రి అమర్నాథ్. జీవీఎల్ తెగిన గాలిపటం లాంటోడు. ఆయన బీజేపీ నాయకుడిగా వాళ్ళ పార్టీనే గుర్తించడం లేదు. 2024 తర్వాత ఏ పార్టీలో ఉంటాడో ఆయనకే తెలియదు… నరసరావుపేట, విజయవాడ అయిపోయాయి ఇప్పుడు వైజాగ్ లో పోటీ అంటున్నారని మండిపడ్డారు. యూపీలో గెలిచి ఏపీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు…జగదాంబ సెంటర్లో వదిలేస్తే తిరిగి ఇంటికి వెళ్లలేని జీవీఎల్….. నాకు ఉన్న అవగాహనపై వ్యాఖ్యానించడం ఎంత వరకు సమంజసం అన్నారు.
అయితే, బీజేపీ MP జీవీఎల్ నరసింహారావు మంత్రి అమర్నాథ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖలో ఐటీ అభివృద్ధి వైఫల్యాలపై బహిరంగ చర్చకు నేను రెడీ…. మంత్రి రెడీ అయితే నా ఛాలెంజ్ స్వీకరించాలి. రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్ లాంటి ఐటీ రంగాన్ని గత, ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఐటీ ఉత్పత్తిలో 15శాతం నిపుణులు ఏపీ నుంచి ఉంటే ఇక్కడ ఐటీ ఉత్పత్తి 0.1శాతం మాత్రమే అన్నారు జీవీఎల్. ఈ లెక్కలు చూసైనా ఐటీ మంత్రి తలదించుకుని యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2030కి వైజాగ్ ఐటీ అభివృద్ధిని బీజేపీ నిర్ధేశించుకుంటే….. వైసిపి మంత్రి జగదాంబ సెంటర్ గురించి చర్చిస్తారు…..ఇదీ వాళ్లకు ఉన్న అవగాహన అని ఎద్దేవా చేశారు. స్టార్ట్ అప్ కంపెనీలు, ఇన్నోవేటివ్ లీడర్స్ సహా ఏ జాబితాలో చూసిన ఏపీ పేరు లేదన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
ఆయనో చైల్డ్ పొలిటికల్ ఆర్టిస్ట్….నాయకుడు అనే వాడికి వయసు కాదు పరిణితి ముఖ్యం. చేపట్టిన శాఖ నిర్వహణపై అవగాహన లేకపోతే నష్టం తప్పదు.. ఆ విషయం చెబితే ఛలోక్తులు విసురుతున్నారు….వాటి వల్ల ప్రయోజనం ఉండదు.. ఏపీలో ఐటీ అభివృద్ధిపై రోడ్ మ్యాప్ విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు జీవీఎల్.
Read Also: Kukatpally Crime News: ఆల్విన్ కాలనీలో విషాదం.. పెట్రోల్ పోసుకుని విద్యార్థిని ఆత్మహత్య