విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న మరియు ప్రతిపాదనలో ఉన్న జాతీయ రహదారులపై పార్లమెంటులో ఎంపీ జీవీఎల్ ప్రశ్నలు సంధించారు. విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో జాతీయ రహదారుల యొక్క నిర్మాణం, విశాఖపట్నం నుండి భోగాపురం బీచ్ కారిడార్ ప్రాజెక్టు యొక్క యొక్క నిర్మాణానికి సంబంధించిన పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్ట్ పూర్తి వివరాలు తెలియజేయమని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించగా మంత్రి సమాధానం ఇచ్చారు. హైవే మంత్రిత్వ శాఖ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ సమాధానం ఇస్తూ మార్చి 2023 కల్లా భోగాపురం-బీచ్ కారిడార్ ప్రాజెక్టు పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్ట్ తయారవుతుందన్నారు.
Read Also: Tiger Dead: వేటగాళ్ల ఉచ్చుకు పులి బలి.. పన్నా టైగర్ రిజర్వ్‌లో ఘటన
గంగవరం పోర్టు నుండి విశాఖపట్నం గాజువాక స్టీల్ ప్లాంట్ మీదగా ప్రయాణించే 16/516e జాతీయ రహదారి పూర్తిస్థాయి ప్రాజెక్ట్ రిపోర్ట్ జూన్ 2023 కల్లా తయారవుతుందని తెలియచేసారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రస్తుత నిర్మాణం ఉన్నటువంటి జాతీయ రహదారి యొక్క వివరాలు వాటికి పూర్తి పరిశీలన గురించి ప్రశ్నించారు. ప్రస్తుతం ఆనందపురం నుండి పెందుర్తి మీదగా అనకాపల్లి చేరుకునే ఎన్ హెచ్ (NH)16 జాతీయ రహదారి ఆరు లైన్లుగా సుమారుగా 50 కిలోమీటర్ల విస్తీర్ణంతో 2527 కోట్ల నిర్మాణంతో విస్తరించబడుతున్నదని, విశాఖపట్నం పోర్ట్రస్ట్ నందు అంతర్గత జాతీయ రహదారి సుమారుగా 3.4 కిలోమీటర్లు మేరకు 36 కోట్ల వ్యయంతో ప్రస్తుతం నిర్మాణంలో ఉందన్నారు.
దీంతోపాటు సబ్బవరం నుంచి షీలానగర్ వరకు నిర్మించబడే ఆరు లైన్ల జాతీయ రహదారి, ఇంకా విశాఖపట్నం పోర్టు రోడ్డు అభివృద్ధి పనులు మరియు పోర్టు కు సంబంధించినటువంటి వివిధ రకాల కనెక్టివిటీ రహదారులతో పాటు గంగవరం పోర్టు నుంచి తొంగాలం వరకు నిర్మించబడే జాతీయ రహదారి వివరాలు మంత్రి సభాముఖంగా అందజేశారు. వివరాలకు అనెక్సర్ పరిశీలించగలరు. దీనిపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న మరియు, ప్రతిపాదనలో ఉన్న రహదారులను తొందరగా పూర్తి చేయడానికి మరియు ప్రారంభించడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టడానికి తను పూర్తిస్థాయి ప్రయత్నం చేస్తానని కేంద్రమంత్రి తెలియజేశారు.
Read Also: Waltair Veerayya: అఫీషియల్.. వాల్తేరు వీరయ్య సంక్రాంతికే