నిజామాబాద్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఇందూరు ప్రజా గర్జన సభలో పాల్గొని ప్రసంగించారు. ముందుగా నా తెలంగాణ కుటుంబ సభ్యులారా అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రూ.8 వేల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు.
ప్రధాని మోడీ మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అభివృద్ధి వ్యతిరేకులకు దేశం ఆరు దశాబ్దాలు సమయం ఇచ్చింది. అప్పుడు ఏం అభివృద్ధి చేశారని మండిపడ్డారు. అభివృద్ధిని పక్కన పెట్టి, పేదవాళ్ళ భావోద్వేగాలతో ఆడుకునేవారని విమర్శించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బిల్లును ప్రభుత్వం అమలు చేయాల్సి వస్తే ఇప్పుడే చేయాలన్నారు. దీనికి డీలిమిటేషన్ ఎందుకని ప్రశ్నించారు. నేటి నుంచే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయవచ్చని తెలిపారు. మహిళా రిజర్వేషన్ మంచిదే అయినప్పటికీ.. అందులో రెండు లోపాలున్నాయని తెలిపారు.
రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. బిల్లుకు మద్దతుగా 215 ఓట్లు రాగా.. రాజ్యసభలో ఒక్కరు కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు.
బీజేపీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జవాన్ల బలిదానాలకు యావత్ దేశం దుఃఖించిందని.. మన సైనికులు అమరులైన సమయంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు జరుపుకోవడం మరింత బాధాకరమన్నారు.
దేశంలో జమిలి ఎలక్షన్స్ అని ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్కడ చెప్పలేదు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు జమిలి ఎలక్షన్స్ అంటే ఎందుకు భయం అవుతుంది.
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేదలకు పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ వెనుకబడి ఉండొచ్చు కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్‌లలో చాలా ముందుందని తీవ్ర విమర్శలు గుప్పించారు.
అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్‌సింగ్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకవైపు అమరవీరుల అంతిమయాత్ర ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే.. మోడీ జీ20 వేడుకలు జరుపుకున్నారని మండిపడ్డారు. సైన్యానికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేయడానికి ప్రధానికి 2 నిమిషాల సమయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
G-20 సమ్మిట్ విందులో ప్రతిపక్ష అలయన్స్ ఇండియా (I.N.D.I.A.) నాయకులు హాజరుకావడంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. శనివారం (సెప్టెంబర్ 9) జరిగిన ఈ విందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు ఇతర నేతలు కూడా హాజరయ్యారు. ఈ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రధాని మోడీ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.