దేశంలో జమిలి ఎలక్షన్స్ అని ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్కడ చెప్పలేదు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు జమిలి ఎలక్షన్స్ అంటే ఎందుకు భయం అవుతుంది.. మోడీ చరిష్మా ముందు ఈ నల్ల మోకాలు చెల్లవు ప్రజలు బీఆర్ఎస్ కు ఓటు వేసే పరిస్థితి లేదు అని ఆయన అన్నారు. ఈడీకి భారతీయ జనతా పార్టీ కి సంబంధం లేదు, మేము దాని మీద స్పందించమని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం కాయం అని ఆ బండి సంజయ్ అన్నారు.
Read Also: Shriya Saran : హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చగొడుతున్న శ్రీయా..
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి బీజేపీ గ్రాఫ్ తగ్గింది అని ప్రచారం చేస్తున్నారు అంటూ బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదు.. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మావాళ్ళే అని కేసీఆర్ అనుకుంటున్నారు అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు.. బీఆర్ఎస్-కాంగ్రెస్ ఒక్కటని క్లారిటీ వచ్చింది అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ఇంటికి పంపించేందుకు రెడీగా ఉన్నారని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని కేసీఆర్ మోసం చేశాడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నారు. ఇలాంటి వ్యక్తికి మరోసారి అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరని ఆయన వ్యాఖ్యనించారు.
Read Also: Bindu Madhavi: ఇంత చూపించినా.. తెలుగమ్మాయికి అవకాశాలు రావట్లేదు ఎందుకో.. ?