Vinod Kumar: ఇందూర్ ప్రజా గర్జన సభలో ప్రధాని మోడీ కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ కేసీఆర్ సీక్రెట్స్ అన్ని బయటపెట్టారు. తాను తెలంగాణ పర్యటనకు వస్తున్న సమయంలో తనకు స్వాగతం పలకపోవడంపై కీలక విషయాలు చెప్పారు. GHMC ఎన్నికలకు ముందు కేసీఆర్ తనకు స్వాగతం పలికేవారన్నారు. అంతేకాకుండా.. కేసీఆర్ NDAలో చేరతానన్న విషయాన్ని కూడా ప్రధాని మోడీ ప్రస్తావించారు. కానీ అందుకు తాను ఒప్పుకోలేదని మోడీ అన్నారు. ఇవే కాకుండా.. ఇంకా చాలా కీలక వ్యాఖ్యలు చేసి.. ఎన్నికల ముందు కేసీఆర్ సీక్రెట్స్ ను రివీల్ చేశారు. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పందించారు.
PM MODI: NDAలో చేరుతానని కేసీఆర్ నన్ను అడిగారు.. సీక్రెట్స్ బయటపెట్టిన ప్రధాని!
కోవిడ్ తరువాత మోడీ హైదరాబాద్ వచ్చారని.. అప్పుడు సీఎం కేసీఆర్ ను మోడీనే వద్దన్నారని వినోద్ కుమార్ తెలిపారు. కేసీఆర్ అంటే మోడీకి ఇష్టం లేదని ఆరోపించారు. GHMC ఎన్నికలకు మోడీ పర్యటనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గురించి మోడీ ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని అన్నారు. కేసీఆర్ను చూసి మోడీ భయపడుతున్నారని చెప్పారు. మోడీ జుమ్లా మాటలు అనేది ఇప్పుడు నిరూపితం అయిందని వినోద్ కుమార్ తెలిపారు. మోడీ అంటే తెలంగాణ, తమిళనాడు, కేరళకు కూడా ఇష్టం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ మోడీ వద్దకు వచ్చి చూస్తానంటే ఎందుకు వద్దాంటారని వినోద్ కుమార్ అన్నారు.