ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వీటితో పాటు పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరు నేతలు దృష్టి పెట్టారు. అంతేకాకుండా.. ఇండియా, సౌదీ అరేబియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్ తొలి సమావేశం మినిట్స్‌పై ఇరువురు నేతలు సంతకాలు చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో పోస్ట్ చేస్తూ.., 2024లో మోడీ ప్రభుత్వం నిష్క్రమణకు ప్రజలు మార్గం సుగమం చేయడం ప్రారంభించారని విమర్శించారు.
ప్రధాని మోడీ బుధవారం ఇండోనేషియా పర్యటనకు వెళ్లారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగే ఆసియాన్-భారత్ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు జకార్తా వెళ్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలు, నియమాల వల్ల కొందరు ఆయనకు వీరాభిమానులుగా మారారు.. దేశ, విదేశాల్లో ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వరల్డ్ వైడ్ గా మోదీ పేరు అంటే తెలియనివారు ఎవరూ ఉండరు. మోదీ అంత క్రేజ్ ను సంపాదించుకున్నారు. అయితే మోదీకి అనేకమంది అభిమానులు సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటారు.. ఆయన పై అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా అభిమానాన్ని చాటుకుంటున్నారు.. గతంలో చాలామంది ఆయనకు ప్రత్యేమైన గిఫ్ట్ లను పంపించారు.. తాజాగా…
ప్రధాని మోడీ సెప్టెంబర్ 7న ఇండోనేషియాలో పర్యటించనున్నారు. జకార్తాలో జరుగనున్న 20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్ మరియు 18వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొననున్నారు.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన 'రాజీవ్ యువ మితాన్ క్లబ్' కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచిందని అన్నారు. బీజేపీ, నరేంద్ర మోడీ భారతదేశంలోని ఇద్దరు, ముగ్గురు బిలియనీర్ల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ రిలీజ్ చేయనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మినీ జమిలి ఎన్నికలు జరగొచ్చని, లోక్‌సభకు డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలు జరుగుతాయన్న చర్చలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఢిల్లీలో ఒక సభలో ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి అస్వస్థతకు గురై.. అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో ప్రధాని తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి సహాయం చేయమని వైద్య బృందాన్ని కోరారు.
కోల్‌కతాలో ముస్లిం మత పెద్దలతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హిందూ పుజారులు, ముస్లిం మత పెద్దలకు గుడ్ న్యూస్ చెప్పారు. వారి నెలవారీ జీత భత్యాన్ని రూ.500 పెంచుతున్నట్టు ప్రకటించారు.