వికారాబాద్ జిల్లా తాండూర్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొ్న్నారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి నేమురు శంకర్ గౌడ్ తరపున ప్రచారం నిర్వహించారు. అనంతరం ఇంద్రచౌక్ లోని రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జనసేన బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ముఖ్య కారణం... బీసీలకు రాజ్యాధికారం ఇస్తున్నందున అని అన్నారు. బీసీలు సీఎం కావాలని తెలిపారు.
Telangana Elections 2023: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో బీజేపీ అగ్రనాయకత్వం వరుస పర్యటనలకు సిద్ధమైంది. ఈ నెల 28న సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనున్న సంగతి తెలిసిందే.
Raja Singh: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీసీ స్వాభిమాన్ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. బీసీలకు భరోసా కల్పించే ఏకైక పార్టీ బీజేపీ అని, బీసీల అభివృద్ధికి పాటుపడుతుందని ప్రధాని పదే పదే చెబుతున్నారు.
PN MODI: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. మంగళవారం భారీ సమావేశం నిర్వహించేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధమైంది. మంగళవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ గర్జన సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
PM Modi:ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో ప్రధాని మోడీ ప్రకటించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాల్ లో సీపీఐ పార్టీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. దేశంలో ఏ ఎన్నికల్లోనైనా వామపక్ష పార్టీలు ప్రజా ఎజెండాను అమలు చేస్తాయన్నారు.
సిక్కింలో వరదలు బీభత్సం సృష్టించాయి. లొనాక్ సరస్సుపై మేఘాలు విస్ఫోటనం చెందడం వల్ల అది పొంగిపొర్లడంతో తీస్తా నదిలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో 10 మంది మృతి చెందారు. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా 82 మంది గల్లంతయ్యారు. అంతేకాకుండా వరదల దాటికి 14 వంతెనలు కూలిపోయాయి.
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి మోడీ కేసీఆర్ బండారం బయటపెడితే ముఖ్యమంత్రి కుమారుడు అంత ఉల్లిక్కి పడుతున్నారు ఎందుకని డీకే అరుణ విమర్శించారు. బీజేపీ నేత విజయశాంతి ట్వీట్ లో స్పందించారు. మోడీ చెప్పినట్లుగా NDA లో చేరుతామని కేసీఆర్ అడిగి ఉండవచ్చు.. నిజమై తప్పక ఉండి ఉంటదని తెలిపారు.
ఇందూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ సీఎంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని పచ్చి అబద్దాల కోరు అని నిజామాబాద్ సభ ద్వార మరోసారి నిరూపించారన్నారు. కేటిఆర్ ని ముఖ్యమంత్రి చేయాలంటే నీ బోడి సహాయం ఎవరికి కావాలని విమర్శించారు.