రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియా గోర్ కలిశారు. ఈ సందర్భంగా రాయబారిగా నియమితులైన పత్రాలను అందజేశారు. సెర్గియో గోర్ నుంచి అక్రిడిటేషన్ పత్రాలను ద్రౌపది ముర్ము స్వీకరించారు.
గత కొద్దిరోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు కారణంగా తీవ్ర నష్టాలు చవిచూసింది. గత వారం లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ట్రంప్ వాణిజ్యం కారణంగా అమెరికా-భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాగానే ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధం ప్రకటించారు. తొలుత భారత్‌పై 25 శాతం సుంకం విధించగా.. అనంతరం రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు.
ఈ మధ్య పదే పదే ట్రంప్ మాట్లాడుతూ తాను సంతోషంగా లేనని ప్రధాని మోడీకి తెలుసు అని చెప్పుకుంటూ వస్తున్నారు. గత ఏడాదంతా వాణిజ్య యుద్ధంతో ప్రపంచ దేశాలపై ట్రంప్ యుద్ధం చేయగా.. ఈ ఏడాది అందుకు భిన్నంగా వెళ్తున్నారు.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఫైటర్ జెట్లను కూల్చాము. భారత్ మా దెబ్బకు వణికిపోయింది.’’ అని ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ అసలు భయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. భారత దాడులకు భయపడిన పాకిస్తాన్, అమెరికాను కాపాడాలని వేడుకున్నట్లు తెలుస్తోంది. తమ వైమానిక స్థావరాలు, ఉగ్రవాద శిబిరాలపై భారత్ విరుచుకుపడిన తర్వాత పాకిస్తాన్ సాయం కోసం అమెరికాకు పరిగెత్తిందని అమెరికా ప్రభుత్వ పత్రాలు తెలియజేస్తున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చిగురిస్తున్న వేళ పుతిన్ నివాసంపై డ్రోన్ దాడులు తీవ్ర కలకలం రేపాయి. సోమవారం అర్ధరాత్రి పుతిన్ నివాసంపై డ్రోన్ దాడులు జరిగాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపించింది.
ఇథియోపియాలో ప్రధాని మోడీకి అరుదైన గౌరవం లభించింది. తొలిసారి ఇథియోపియాలో పర్యటించిన ప్రధాని మోడీకి ప్రత్యేక గౌరవాన్ని కనుపరిచారు. ఆద్యంతం ఇథియోపియా నేతలంతా ఘనంగా స్వాగతం పలికారు. అంతేకాకుండా మోడీకి అపూర్వ గౌరవం లభించింది.
ఢిల్లీలో పుతిన్ పర్యటన కొనసాగుతోంది. హైదరాబాద్ హౌస్‌లో పుతిన్-మోడీ ద్వైపాక్షిక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధం గురించి మోడీ ప్రస్తావించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతదేశం తటస్థంగా లేదని.. భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపే ఉంటుందని తేల్చి చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ శాంతి మార్గంలోకి రావాలని వస్తాయని ఆకాంక్షిస్తున్నట్లు మోడీ వ్యాఖ్యానించారు. అయినా ఈ కాలం యుద్ధం యుగం కాదని తెలిపారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన భారత్‌లో కొనసాగుతోంది. ఉదయం రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది. ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనాన్ని పుతిన్ స్వీకరించారు. అక్కడ నుంచి రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన భారత్‌లో కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని మోడీ స్వయంగా వెళ్లి స్వాగతం పలికారు. ఇద్దరూ ఆలింగనం చేసుకున్నాక ఒకే కారులో ప్రయాణం చేశారు.