మరోవైపు మణిపూర్ మండిపొతున్నా కేంద్రం చోద్యం చూస్తుందని దుయ్యబట్టారు. గుజరాత్ తరహా కుట్రలు మణిపూర్ లో అంతకు మించి చేశారని ఆరోపించారు. మణిపూర్ లో విద్వేషాలు రెచ్చ గొట్టింది బీజేపీనేనని విమర్శించారు సీపీఐ నారాయణ అన్నారు.
సవాళ్ల సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను ఆశాకిరణంగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఈ సవాలు సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ ఆశాకిరణంలా ప్రకాశిస్తోందని ఆయన శనివారం అన్నారు.
ఢిల్లీలో నెహ్రూ మొమోరియల్ మ్యూజియం పేరును పీఎం మ్యూజియంపై మార్చడంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ స్పందించారు. అనంతరం మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ రాజకీయ చరిత్ర నుంచి నెహ్రూ పేరును ఎవరు చెరిపేయలేరన్నారు. నెహ్రూ పేరు చిరస్థాయిగా ఉంటుందన్నారు. తాను చేసిన మంచిపనులతో నెహ్రూకు గుర్తింపు వచ్చిందని, నెహ్రూ అన్న పేరుతో కాదని రాహుల్ తెలిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చైనా అంశంపై ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. గత 9 ఏళ్లుగా చైనా భారత్‌పై కన్నేసిందని.. అయితే ప్రధాని పూర్తిగా మౌనంగా ఉన్నారని విమర్శించారు.
నరేంద్ర మోడీ, కేసీఆర్, రాహుల్ గాంధీని ఢీ కొట్టే శక్తి కేఏ పాల్ కే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కవితని ఈడీ అరెస్ట్ చేయకపోతే బీజేపీ 40 సీట్లు గెలుస్తుంది అని చెప్పాను.. ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం ఉందని పాల్ అన్నారు. కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్న చాలా మంది మంత్రులు నాతో టచ్ లో ఉన్నారు.
సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ మంగళవారం (ఆగస్టు 15) కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు.
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. వరుసగా 10వ సారి ఎర్రకోటపై ప్రధాని మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగువేయనున్నారు. ఉదయం 7.30కు జాతీయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరణ చేయనున్నారు.
దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రహోంశాఖ మంత్రి సోమవారం నివాళులు అర్పించారు. 1947 ఆగస్ట్ 14న విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తు చేసుకున్నారు.
అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి జీ-20 దేశాల సమిష్టి కృషి తోడ్పడుతుందనీ ప్రధాని మోడీ తెలిపారు. అంతేకాకుండా.. అవినీతికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ అనే కఠినమైన విధానం ఇండియాలో ఉందని జీ-20 సమావేశంలో ప్రధాని తెలిపారు.