CM Kejriwal: నలుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందితే.. బీజేపీ సంబరాలు చేసుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ సహా దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జవాన్ల బలిదానాలకు యావత్ దేశం దుఃఖించిందని.. మన సైనికులు అమరులైన సమయంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు జరుపుకోవడం మరింత బాధాకరమన్నారు.
Read Also: Nadendla Manohar: రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్ట్
Also Read
- CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
- Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
- Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోడీ, హోంమంత్రి, రక్షణ మంత్రి సంబరాలు చేసుకుంటున్నారని కేజ్రీవాల్ అన్నారు. దేశం మొత్తం విషాదంలో మునిగిపోతే.. వారు మాత్రం సంబరాలు చేసుకున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. నలుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందితే ఇప్పటికీ ప్రధాని స్పందించలేదన్నారు. వారి కోసం ఒక్క మాట.. ఒక్క ట్వీట్ కూడా చేయలేదని తెలిపారు. ప్రతిదానిపైనా ట్వీట్లు చేసే ప్రధాని, హోంమంత్రి జవాన్ల మరణంపై ఎందుకు ఉలుకు పలుకు లేదన్నారు.
Read Also: Pawan Kalyan Varahi Yatra: నాలుగో విడత వారాహి యాత్రకు సిద్దమవుతున్న పవన్ కళ్యాణ్
మరోవైపు విపక్షాల పేరు(INDIA)ను చూసి బీజేపీ భయపడుతోందని కేజ్రీవాల్ తెలిపారు. విపక్షాల కూటమికి ఇండియా పేరు పెట్టడంపై.. ఇప్పుడు దేశం పేరు మారుస్తామంటూ బీజేపీ రెచ్చిపోతుందని పేర్కొన్నారు. భారతదేశం మీ నాన్నగారికి చెందిందా.. భారతదేశం 140 కోట్ల మంది ప్రజలదని అన్నారు. అంతేకాకుండా.. బీజేపీకి కేజ్రీవాల్ బహిరంగ సవాల్ విసిరారు. గతేడాది వరకు డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలను చేపట్టిన బీజేపీ.. ప్రతిపక్షాలు ఇండియాగా పేరు మార్చినప్పుడు పేరు మారుస్తామని చెప్పారు. వచ్చే సమావేశంలో విపక్షాల కూటమికి భారత్ అని పేరు పెడితే.. బీజేపీ భారతదేశం పేరు మారుస్తారా అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
-
Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
-
Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
-
Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!