రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. బిల్లుకు మద్దతుగా 215 ఓట్లు రాగా.. రాజ్యసభలో ఒక్కరు కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు. ఇప్పటికే లోక్ సభ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. లోక్‌సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 2 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లులో లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిబంధన పెట్టారు. కేంద్ర న్యాయ, న్యాయ శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) అర్జున్ రామ్ మేఘవాల్ రాజ్యాంగ (128వ సవరణ) బిల్లు, 2023ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
Kadiyam Srihari : బీజేపీ, కాంగ్రెస్ మాటలు నమ్మితే మళ్ళీ వెనక్కి వెళ్తాం
ఈ బిల్లు మహిళా సాధికారతకు సంబంధించినదని.. ఇది చట్టంగా మారిన తర్వాత 543 మంది సభ్యులున్న లోక్‌సభలో ప్రస్తుత మహిళా సభ్యుల సంఖ్య 82 నుంచి 181కి పెరుగుతుందని అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా చెప్పారు. అలాగే.. అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేయబడతాయన్నారు. దీని కింద ఎస్సీ-ఎస్టీ మహిళలకు కూడా రిజర్వేషన్లు వస్తాయని తెలిపారు. అందువల్ల జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ముఖ్యమైనవని అన్నారు. బిల్లు ఆమోదం పొందిన వెంటనే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ జరుగుతాయని.. ఇది రాజ్యాంగ ప్రక్రియ అని చెప్పారు. మహిళలకు ఏయే సీట్లు రావాలో డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపారు.
Neha Shetty: హీరోయిన్ తో పవన్ నిర్మాత కొడుకు గొడవ.. దాని కోసం అంత టార్చరా..?
రాజ్యసభలో బిల్లుపై ఓటింగ్‌కు ముందు.. ఈ బిల్లు దేశ ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని కలిగిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మహిళా సాధికారత, మహిళా శక్తిని పెంపొందించడంలో అన్ని పార్టీల సభ్యు, రాజకీయ పార్టీలు ముఖ్యమైన పాత్ర పోషించాయని పేర్కొన్నారు. బిల్లు ఆమోదం పొందడం వల్లనే మహిళా శక్తికి ప్రత్యేక గౌరవం లభిస్తోందని తెలిపారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లు పట్ల సానుకూలంగా ఆలోచించడం.. దేశ మహిళా శక్తికి కొత్త శక్తిని ఇవ్వబోతోందని ప్రధాని చెప్పారు.