PM Modi: ప్రతిపక్షాలు కులం, మతం పేరుతో గందరగోళం సృష్టిస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఈ ఏడాది చివరలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ పర్యటన సంతరించుకుంది. ఈ సందర్భంగా గ్వాలియర్ చేరుకున్న ప్రధాని.. రాష్ట్రానికి సంబంధించి రూ.19,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
Read Also: Health Tips : రోజూ 30 నిమిషాల వాకింగ్ చెయ్యడం వల్ల కలిగే లాభాలెంటో తెలుసా?
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అభివృద్ధి వ్యతిరేకులకు దేశం ఆరు దశాబ్దాలు సమయం ఇచ్చింది. అప్పుడు ఏం అభివృద్ధి చేశారని మండిపడ్డారు. అభివృద్ధిని పక్కన పెట్టి, పేదవాళ్ళ భావోద్వేగాలతో ఆడుకునేవారని విమర్శించారు. అప్పుడు కులం పేరుతో సమాజాన్ని చీల్చేవారని.. నేడు కూడా అదే పాపం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు అవినీతిలో కూరుకుపోయారని.. నేడు కూడా తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారని ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం బీహార్ ప్రభుత్వం కులంపై సర్వే నివేదికను విడుదల చేసిన తరుణంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Asian Games 2023: బంగ్లాను ఓడించి.. సెమీస్కు చేరిన భారత హాకీ టీం
ఇదిలా ఉంటే.. ప్రతిపక్షాలు కులం, మతం పేరుతో గందరగోళం సృష్టిస్తున్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కాంగ్రెస్, కూటమి నేతలు మహిళలపై ఎలాంటి కించపరిచే మాటలు మాట్లాడుతున్నారో మనం రోజూ చూస్తూనే ఉన్నామని తెలిపారు. మహిళలకు హక్కులు దక్కడం లేదని ఆరోపణలు చేస్తూ.. కులం సాకులు చెబుతూ ప్రచారం చేస్తున్నారని ప్రధాని అన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం ఒక్కరోజులో చేసినంత ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన పనులు ఏ ప్రభుత్వం ఒక్క ఏడాదిలో చేయలేదన్నారు. కొత్త ఆలోచనలు లేని, అభివృద్ధికి రోడ్ మ్యాప్ లేని వ్యక్తుల వల్ల మధ్యప్రదేశ్ అభివృద్ధి చెందదని ప్రధాని పేర్కొన్నారు. దేశ ప్రగతిని ద్వేషించడమే వారి ఏకైక పని అని విపక్షాలను దుయ్యబట్టారు. వారి ద్వేషంతో దేశం సాధించిన విజయాలను కూడా మర్చిపోతారని ప్రధాని మోడీ ఆరోపించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!