తాడు బొంగరం లేని వాల్లంతా పేపర్ లీక్ పై మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ లో కార్యకర్తలతో తలసాని మాట్లాడుతూ.. అందరికీ పదవులు సాధ్యం కాదు.. ప్రభుత్వంలో పరిమిత సంఖ్యలో పదవులు ఉంటాయన్నారు.
ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయని RS ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి తెలంగాణ కొందరి తెలంగాణగా మారిందని ఆరోపించారు. నిరుద్యోగ సమస్య ఎంతో తీవ్రంగా ఉందని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డివి అన్ని దొంగ మాటలు, ఆయన వెంట ఉన్న వాళ్లందరూ దొంగలు అంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ ప్రభుత్వం కట్టించిన ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కాంగ్రెస్ కట్టించిన 10 ఇళ్లలో సమానం అన్నారు.
తెలంగాణ వాడుక భాషలో ఉపయోగించే పదాలనే మాట్లాడినా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి సంజయ్ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు ఇవాల హాజరయ్యారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. ఇవాల ఉదయం 11 గంటలకు మహిళ కమిషన్ ముందుకు బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ హాజరు కానున్నారు.