Bandi sanjay: తెలంగాణ వాడుక భాషలో ఉపయోగించే పదాలనే మాట్లాడినా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి సంజయ్ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు ఇవాల హాజరయ్యారు. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు బండి సంజయ్ వివరణ ఇచ్చారు. బండి సంజయ్ తన వివరణలో కవితను ఉద్దేశించి మాట్లాడిన మాటలను సమర్థించుకున్నారు. తెలంగాణ వాడుక భాషలో ఉపయోగించే పదాలనే తాను మాట్లాడినట్లు సమాధానం ఇచ్చారు. తెలంగాణ కుటుంబ సభ్యులు ఉపయోగించే భాషనే ఉపయోగించినట్లు చెప్పారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగిందని, తెలంగాణలో సామెతను మాత్రమే నేను అన్నానని బండి సంజయ్ అన్నారు. నేను తప్పు చేయనప్పుడు వెళ్లాల్సిందే నని కమిషన్ ముందుకు వెళ్ళాను అని చెప్పుకొచ్చారు.
Read also: Men forever young: అబ్బాయిలు నిత్య యవ్వనంగా ఉండేందుకు ఇవి తినండి
ఇక మంత్రి కేటీఆర్ పై సంజయ్ ఫైర్ అయ్యారు. ఇంటర్ పిల్లలు ఎందుకు చనిపోయారు? ధరణి వల్ల ప్రజలు కష్టాలు పడుతున్నారు? స్వప్నలోక్ కాంప్లెక్స్ లో చనిపోయారు? ఇవన్నీ ఆయన శాఖ పరిధిలోనివే కదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈడి, సీబీఐ, బీజేపీ, సంస్థల మరి? అంటూ సెటైర్ వేశారు. మంచి జరిగితే తన వల్ల అంటాడు.. తప్పు జరిగితే ఇతరుల మీద తోస్తాడు అంటూ వ్యంగాస్త్రం వేశారు. మహిళా కమిషన్ గౌరవ ప్రదమైన సంస్థ, వాళ్ళు అడిగిన ప్రశ్నలు చెప్పడం కరెక్ట్ కాదన్నారు. రేణుక వాళ్ళ అన్న BRS పార్టీ నేత, ఆయన్ను అరెస్ట్ చేశారని సంచలన వ్యాఖ్యాలు చేశారు. తప్పు చేయనప్పుడు సిట్టింగ్ జడ్జి తో ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి ఇన్నీ ఏళ్ల నుండి పనిచేస్తుంటే దొంగను ఎందుకు పట్టుకోలేదని మండిపడ్డారు బండి సంజయ్.
Fire Accident: ఇంట్లో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది సజీవదహనం