ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ ఈడీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కవితకు మద్దతుగా ఢిల్లీల్లో ఫ్లెక్సీలు, హోర్డింగులు వెలిశాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కవిత ఈడీ అధికారుల ముందు హాజరవుతారు.