MLC Kavitha: నేడు తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సోషల్ మీడియాలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Dharmapuri Arvind: కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైడి రాకేష్ రెడ్డి బీజేపీలో చేరారు. పార్టీ ఖండువా కప్పి తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ ఆహ్వానించారు.
Bandi sanjay: ఓ సెక్షన్ మీడియా చేస్తున్న ప్రచారం తప్ప మాకు ఎలాంటి విభేదాలు లేవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనం ప్రారంభం - రాష్ట్రపతి ఆహ్వానం వివాదం పై ఆయన స్పందించారు.
నేడు ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈడీ విచారణ తరువాత తొలిసారిగాని ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పర్యటించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు.
మ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్‌కుమార్, చల్లా వెంకట్రామ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్లో కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు.
కేటీఆర్ పై కుట్రలు చేస్తున్నారు.. ప్రతిపక్షాల చర్యలు సరిగా లేవని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో నియంత పాలన సాగుతుందని అన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి వెల్లి మహిళా రిజర్వేషన్ బిల్లుపై పోరాడం ఏంటని, మీకు ఏ అధికారం ఉందంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.