ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. కేంద్రం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరికిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. హైదరాబాదులో మరోసారి కవిత ఫ్లెక్సీలు వెలిశాయి. ఎన్ని కుట్రలు పన్నినా కవిత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని పేర్కొంటూ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరుతో ఈ ఫ్లెక్సీలు అసెంబ్లీ వద్ద దర్శనమిచ్చాయి.
Also Read : Patna: పాట్నా రైల్వే స్టేషన్ జుగుప్సాకరమైన సంఘటన.. స్కీన్‌పై పోర్న్ వీడియో ప్లే..
ఇదిలా ఉంటే ఈ నెల 11న కూడా కవిత ఈడీ విచారణ నేపథ్యంలో.. ఈడీ, సీబీఐ లతో బీజేపీ బెదిరింపు రాజకీయాలు చేస్తుందని హైదరాబాద్‌లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ.. ఆ పార్టీలో చేరిన కొందరు నాయకులను పేర్కొంటూ నగరంలోని పలుచోట్ల పోస్టర్లు అంటించారు. ఆ పోస్టర్లలో కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత సువేంధు అధికారి, ఆంధ్రప్రదేశ్‌లోని బీజేపీ నేత సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఫొటోలను ఉంచారు. చివర్లో బై బై మోదీ అని ఆ పోస్టర్లు, ఫ్లెక్సీలలో రాసుకొచ్చారు.
Also Read : Girlfriend Ride: బైక్‌పై ప్రియురాలు షికార్లు.. తట్టుకోలేక ప్రియుడు ఏం చేశాడంటే?