తాడు బొంగరం లేని వాల్లంతా పేపర్ లీక్ పై మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ లో కార్యకర్తలతో తలసాని మాట్లాడుతూ.. అందరికీ పదవులు సాధ్యం కాదు.. ప్రభుత్వంలో పరిమిత సంఖ్యలో పదవులు ఉంటాయన్నారు.
ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయని RS ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి తెలంగాణ కొందరి తెలంగాణగా మారిందని ఆరోపించారు. నిరుద్యోగ సమస్య ఎంతో తీవ్రంగా ఉందని మండిపడ్డారు.