1. ఢిల్లీలో నేడు పార్లమెంట్ కార్యాలయంలో ప్రధానితో సీఎం జగన్ భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్ట్, విభజన హామీలు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించే అవకాశం.
2. నేడు బండి సంజయ్ నిరసన దీక్ష. టీఎస్సీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్. ఉదయం 10 గంటలకు గన్‌పార్క్ దగ్గర బండి సంజయ్ దీక్ష.
3. నేడు గవర్నర్‌ను కలువనున్న బీజేపీ నేతలు. టీఎస్సీఎస్సీ పేపర్ లీక్‌పై ఫిర్యాదు చేయనున్న నేతలు.
4. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఎమ్మెల్సీ కవిత. నేడు పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని న్యాయస్థానాన్ని కోరనున్న కవిత తరుఫు న్యాయవాదులు.
5. హైదరాబాద్ నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,870లుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,050 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.72,500లుగా ఉంది.
6. నేడు నాలుగోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. కొశ్చన్ అవర్‌తో ప్రారంభంకానున్న శాసన సభ. బడ్జెట్‌పై శాసనసభలో సమాధానమివ్వనున్న మంత్రి బుగ్గన.
7. కాంతార సినిమాకు అరుదైన గౌరవం. నేడు ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ప్రదర్శన. పర్యావరణ పరిరక్షణలో భారతీయ సినిమా పాత్రపై ప్రదర్శన తర్వాత ప్రసంగించనున్న రిషబ్ శెట్టి.
8. నేడు ముంబైలో భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డే. మధ్యాహ్నం 1.30 గంటలకు వాంఖడేలో మ్యాచ్.