Bandi sanjay: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. ఇవాల ఉదయం 11 గంటలకు మహిళ కమిషన్ ముందుకు బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ హాజరు కానున్నారు. బీజేపీ లీగల్ సెల్, మహిళ న్యాయవాదులతో కలిసి కమిషన్ కు బండి సంజయ్ వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ కవిత పై చేసిన కామెంట్స్ వ్యక్తిగతంగా హాజరు అయ్యి వివరణ ఇవ్వాలని మహిళ కమిషన్ నోటీస్ లో పేర్కొంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీరియస్‌గా తీసుకున్న మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. మార్చి 15న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కానీ దీనిపై స్పందించిన బండి సంజయ్.. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో 15న విచారణకు హాజరు కాలేనని మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు లేఖ రాశారు. విచారణను 18వ తేదీకి వాయిదా వేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మహిళా కమిషన్ ఈ నెల 18న ఉదయం 11 గంటలకు స్వయంగా విచారణకు హాజరుకావాలని సూచించింది. ఈనేపథ్యంలో.. ఇవాల బండి సంజయ్ మహిళా కమిషన్ ముందు హాజరుకానున్నారు. అయితే బండి సంజయ్, మహిలా కమిషన్ లకు ఏం సమాధానం ఇవ్వనున్నారో అనే విషయం పై ఉత్కంఠ నెలకొంది.
Read also: Fire accident: రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. పక్కనే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్..!
తాజాగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కవిత అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించే క్రమంలో కవితను అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. mlc కవిత వికెట్ పడిపోయిందని అతి త్వరలో బీఆర్ఎస్‌లో మరికొంతమంది క్లీన్ బౌల్డ్ అవుతారని అన్నారు. అంతేకాకుండా.. మద్యం కుంభకోణం, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌తో పాటు ఇటు రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బండి సంజయ్‌కు, బీజేపీకి వ్యతిరేక నినాదాలు చేయడంతో పాటు బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేసిన విషయం తెలిసిందే..
Revanth Reddy: నేడు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పాదయాత్ర..